VBVK 3 Days Collections: సగానికి సగం డౌన్.. ఆ రికార్డు కొట్టిన కిరణ్.. ఇంకెంత వస్తే హిట్ అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తోన్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకడు. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తోన్న అతడు.. తాజాగా 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా భారీ స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

విష్ణు కథ చెప్పిన కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రమే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. దీనికి చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ అబ్బవరంకు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'వినరో భాగ్యము విష్ణు కథ'కు తెలుగులో 3వ రోజు వసూళ్లు బాగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 44 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'వినరో భాగ్యము విష్ణు కథ'కు 3 రోజుల్లో భారీగానే వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 54 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో కలిపి.. రూ. 3.00 కోట్లు షేర్, రూ. 5.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లోనే రూ. 3.00 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 12 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 17 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 3 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 3.29 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.15 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే
సరికొత్త నేపథ్యంతో వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 3.29 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.21 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

సగం డౌన్.. ఆ మార్కును చేరి
ఈ మధ్య కాలంలో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నా విజయాలను అందుకోలేకపోతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడు చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు మాత్రం భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్ల మార్కును చేరుకుంది. కానీ, సోమవారం మాత్రం 60 శాతం వసూళ్లు డౌన్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











