VBVK Day 3 Collections: హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి.. 'సార్' కంటే ఎక్కువగా!
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. గతేడాది సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంతో మొదలు పెట్డాడు. అయితే గతేడాది విడుదలైన మూడు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 18న మహా శివరాత్రి కానుకగా విడుదల కాగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఫలింతగా కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నిర్మాత..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించి లేటెస్ట్ మూవీ 'వినరో భాగ్యము విష్ణు కథ'. న్యూ డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా అలరించింది. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్..
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరానికి తెలుగు రాష్ట్రాల్లో అంతగా మార్కెట్ లేదు. కానీ, కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'పై ప్రారంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అందుకు అనుగుణంగా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా ఫిబ్రవరి 18న విడుదల చేశారు.

థియేటర్ ఆక్యుపెన్సీ..
కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రమే 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాకు తెలుగులో మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీ మూడో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఉదయం 34.72 శాతం, మద్యాహ్నం కాస్త తగ్గి 28.36 శాతం, సాయంత్రం ఉదయం షోల కంటే పెరిగి 35.92 శాతంగా నమోదు అయింది. ఈ లెక్కన స్టార్ హీరో ధనుష్ సార్ సినిమా కంటే కాస్తా ఎక్కువగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయిందని చెప్పవచ్చు.

మూడో రోజు వచ్చింది..
కొత్త డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో న్యూ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మూవీ 'వినరో భాగ్యము విష్ణు కథ'. ట్రైలర్ నుంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం వీబేవీకే చిత్రానికి మూడో రోజు రూ. 1.15 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ధనుష్ సినిమాతో పోటీ పడుతూ కూడా మండే రోజు కలెక్షన్స్ పర్వాలేదనిపించుకున్నాయి.

3 రోజుల్లో వచ్చింది ఎంతంటే..
ఆద్యంతం ట్విస్టులతో ఎంగేజ్ చేసిన సినిమాగా కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాను ప్రశంసిస్తున్నారు. మొన్నటి వరకు హిట్లు అందుకోలేని కిరణ్ అబ్బవరం తాజా సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాడు. దీంతో వీబీవీకే సినిమాకు మూడు రోజుల్లో రూ. 5.30 కోట్లు కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

బ్రేక్ ఈవెన్ పూర్తి.. లాభాలు ఎంతంటే..
ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'తో హిట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా ఫిక్స్ కాగా కేవలం 3 రోజుల్లోనే రూ. 5.30 కోట్లు కొల్లగొట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసింది ఈ సినిమా. అంతేకాకుండా ఈ చిత్రం హిట్ కాగా.. సుమారుగా రూ. 80 లక్షల లాభాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











