VBVK 4 Days Collections: 4వ రోజూ డౌన్.. అయినా అన్ని కోట్లతో అరాచకం.. హిట్‌కు చేరువగా కిరణ్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసి మంచి పేరు తెచ్చుకుంటోన్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. ఇప్పటికే చాలా సినిమాలు చేసిన అతడు.. తాజాగా 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా భారీ స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

విష్ణు కథ అంటూ వచ్చేసిన హీరో

విష్ణు కథ అంటూ వచ్చేసిన హీరో

టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం నటించిన చిత్రమే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 అంచనాలు.. బిజినెస్ వివరాలు

అంచనాలు.. బిజినెస్ వివరాలు


కిరణ్ అబ్బవరంకు ఆంధ్రా, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గానే విడుదల చేశారు.

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

'వినరో భాగ్యము విష్ణు కథ'కు తెలుగులో 4వ రోజు వసూళ్లు మరింత పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 32 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది


4 రోజుల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ'కు భారీగానే వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 59 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 29 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 3.32 కోట్లు షేర్, రూ. 6.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


టాలెంటెడ్ గాయ్ కిరణ్ నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఏపీ, తెలంగాణలో 4 రోజుల్లోనే రూ. 3.32 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 22 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 3.69 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.00 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే


క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 3.69 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 81 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంటుంది.

 టార్గెట్‌కు మరింత చేరువగానే

టార్గెట్‌కు మరింత చేరువగానే


టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నా విజయాలను అందుకోలేకపోతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడు చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు మాత్రం భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు మరింత చేరువగా వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X