VBVK 5 Days Collections: మళ్లీ వసూళ్లు డౌన్.. 5రోజుల్లో మాత్రం అన్ని కోట్లు.. కిరణ్ హిట్ కొట్టాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న హీరోలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం ఒకడు. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. 'ఎస్ఆర్ కల్యాణమండపం'తో భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పలు చిత్రాలను చేసినా.. అతడికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో కిరణ్ ఇప్పుడు 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం 5 రోజుల రిపోర్టు మీకోసం!

మరో కొత్త కాన్సెప్టుతో వచ్చిన హీరో
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రమే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు
ఏపీ, తెలంగాణలో కిరణ్ అబ్బవరంకు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గానే రిలీజ్ చేసేశారు.

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
5వ రోజు 'వినరో భాగ్యము విష్ణు కథ'కు తెలుగులో వసూళ్లు మరింత తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 25 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'వినరో భాగ్యము విష్ణు కథ'కు 5 రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి.. రూ. 3.57 కోట్లు షేర్, రూ. 6.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లోనే రూ. 3.57 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 16 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 25 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 3.98 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.60 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే
విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 3.98 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 52 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

కిరణ్‌కు హిట్ గ్యారెంటీనే కానీ
టాలీవుడ్ యవ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు ఆరంభంలో మాత్రం భారీ రెస్పాన్స్ దక్కింది. కానీ, క్రమంగా ఈ సినిమాకు కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతుందని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి కిరణ్ ఖాతాలోకి హిట్ వస్తుంది.. కానీ, కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











