VBVK 6 Days Collections: హిట్‌కు దగ్గర్లో కిరణ్.. అన్ని లక్షలు వస్తే రికార్డు.. 6వ రోజు మాత్రం!
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే హీరోగా పరిచయమైనా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. వరుసగా విభిన్నమైన సినిమాలతో సందడి చేస్తోన్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం. ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను పట్టేస్తోన్న అతడికి ఈ మధ్య కాలంలో వరుస షాక్‌లు తగిలాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్ 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా మంచి స్పందన వస్తోంది. ఫలితంగా డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. మరి ఈ మూవీ 6 రోజుల రిపోర్టు చూద్దామా!

విష్ణు కథ అని వచ్చిన కుర్రాడు
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమానే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ అబ్బవరంకు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎక్కువ థియేటర్లలోనే విడుదలైంది.

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'వినరో భాగ్యము విష్ణు కథ'కు 6వ రోజు తెలుగులో వసూళ్లు మరింత తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది
6 రోజుల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వసూళ్లు బానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 34 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి.. రూ. 3.77 కోట్లు షేర్, రూ. 7.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లోనే రూ. 3.77 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 27 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 4.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.10 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే
వైవిధ్యమైన కథతో రూపొందిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 4.21 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 29 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఈ వీకెండ్‌లో విజయం ఖాయం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు మొదట్లోనే భారీ రెస్పాన్స్ దక్కింది. కానీ, క్రమంగా ఈ సినిమాకు కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతుంది. ఇలా మొత్తంగా విజయానికి మరింతగా చేరువగా వచ్చింది. ఈ వీకెండ్‌లోనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకునే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











