VBVK 8 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. కిరణ్ ఖాతాలో మరో హిట్.. లాభం ఎంతో తెలిస్తే!

ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం. కెరీర్ మొదలైన కొత్తలోనే విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలంగా సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత వారమే 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా మంచి స్పందన వస్తోంది. ఫలితంగా డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. మరి ఈ మూవీ ఎనిమిది రోజుల రిపోర్టును చూడండి!

మరో క్రేజీ కాన్సెప్టుతో వచ్చేశాడు

మరో క్రేజీ కాన్సెప్టుతో వచ్చేశాడు


టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క్రేజీ మూవీనే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు

అంచనాలు.. బిజినెస్ వివరాలు


కిరణ్ అబ్బవరంకు ఆశించిన రీతిలో మార్కెట్ ఏర్పడలేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయింది.

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

8వ రోజు 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి తెలుగులో వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 28 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది

ఎనిమిది రోజుల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వసూళ్లు బానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 76 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 39 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. రూ. 4.26 కోట్లు షేర్, రూ. 8.07 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 8 రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో రూ. 4.26 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 30 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 4.73 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.20 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే

క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 4.73 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 23 లక్షలు లాభాలు కూడా సొంతం అయిపోయాయి

కిరణ్ ఖాతాలో మరో విజయం

కిరణ్ ఖాతాలో మరో విజయం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. కానీ, ఈ మధ్య అతడికి లక్ అంతగా కలిసి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా అధికారికంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు లాభాలను కూడా అందుకుంది. దీంతో అతడి ఖాతాలో మరో విజయం వచ్చి చేరినట్లు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X