VBVK 9 Days Collections: సెలవు రోజు తగ్గిన కలెక్షన్స్.. హిట్ కొట్టిన యంగ్ హీరో.. లాభం ఎంతంటే?
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. గతేడాది సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంతో మొదలు పెట్డాడు. అయితే గతేడాది విడుదలైన మూడు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.
దీంతో ఎలాగైన హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫలింతగా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో 9 రోజుల వసూళ్లు చూసుకుంటే!

కొత్త హీరోయిన్..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించి తాజా చిత్రమే 'వినరో భాగ్యము విష్ణు కథ'. కొత్త డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా అలరించింది. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్..
తెలుగు యువ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరానికి తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్దగా మార్కెట్ లేదు. కానీ, కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'పై ప్రారంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అందుకు అనుగుణంగా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా ఫిబ్రవరి 18న విడుదల చేశారు.

9వ రోజు ఎంతంటే..
కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాకు వసుళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 24 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలు చేసింది.

9 రోజుల్లో వచ్చింది..
కొత్త డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో న్యూ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మూవీ 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాకు 9 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. వీబీవీకే చిత్రానికి 9 రోజుల్లో నైజాంలో రూ. 2.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 82 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలిపి.. రూ. 4.50 కోట్లు షేర్, రూ. 8.52 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
అంటే సెలవు రోజైన సండే కూడా ఈ చిత్రానికి అంతగా కలెక్షన్స్ రానట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ గా..
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 4.50 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 31 లక్షలు కలెక్షన్స్ రాబట్టింది. ఇలా వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకు రూ. 4.98 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.70 కోట్లు గ్రాస్ కలెక్ట్ వసూళు చేసింది.

ప్రాఫిట్ ఎంతంటే..
ట్విస్టులు, లవ్, రొమాంటిక్ కాన్సెప్టుతో తెరకెక్కిన కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక ఈ చిత్రం 9 రోజుల్లో దీనికి రూ. 4.98 కోట్లు వచ్చాయి. అంటే ఈ సినిమా హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 48 లక్షలు ప్రాఫిట్ కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











