VBVK Day 1 Collections: కిరణ్ అబ్బవరం రికార్డు.. తొలి రోజే అన్ని కోట్లు.. టాప్ ప్లేస్‌కు చేరిన మూవీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును అందుకున్నారు. అదే సమయంలో భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి యంగ్ హీరోల్లో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం ఒకడు. అయితే, కొన్ని చిత్రాలుగా విజయాన్ని అందుకోలేకపోతోన్న కిరణ్.. ఇప్పుడు 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లపై ఓ లుక్కేద్దామా!

విష్ణు కథ చెప్పేందుకు వచ్చాడు

విష్ణు కథ చెప్పేందుకు వచ్చాడు

టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రమే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. దీనికి చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు

అంచనాలు.. బిజినెస్ వివరాలు

కిరణ్ అబ్బవరంకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

అలాంటి టాక్.. వసూళ్లు భారీగా

అలాంటి టాక్.. వసూళ్లు భారీగా

హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకుల స్పందన మాత్రం భారీగానే వచ్చింది. ముఖ్యంగా సాయంత్రం షోలు నిండిపోయాయి.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

'వినరో భాగ్యము విష్ణు కథ'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 66 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 1.35 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 1.35 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 9 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 1.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 1.51 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.99 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుకుంటుంది.

కిరణ్ కెరీర్‌లోనే టాప్ మూవీగా

కిరణ్ కెరీర్‌లోనే టాప్ మూవీగా

కిరణ్ అబ్బవరం ఈ మధ్య సరైన ఫలితాలను మాత్రం అందుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడు చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు మాత్రం భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో మొదటి రోజే ఈ చిత్రం టోటల్‌గా రూ. 2.85 కోట్లు గ్రాస్ రాబట్టింది. తద్వారా 'ఎస్ఆర్ కల్యాణమండపం' రికార్డు (రూ. 2.70 కోట్లు) బ్రేక్ చేసి.. అతడి కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X