VBVK Total Collections: హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. అన్ని కోట్ల మార్క్ దాటి.. లాభాలు ఎంతంటే?

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. గతేడాది సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంతో మొదలు పెట్డాడు. ఇప్పుడు మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా!

పాజిటివ్ రెస్పాన్స్: అనేక ట్విస్టులతో సాగుతూ ఉండే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం అలరించాడు. కొత్త డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా అలరించింది. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie Total Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్: తెలుగు యువ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరానికి తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్దగా మార్కెట్ లేదు. కానీ, కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'పై ప్రారంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో: మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న విడుదలైన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 2.22 కోట్లు, సీడెడ్ లో రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలు నమోదు అయింది. అంటే కిరణ్ అబ్బవరం సినిమా టోటల్ గా 4.80 కోట్ల షేర్, రూ. 9.20 కోట్ల గ్రాస్ తో పూర్తయింది.

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie Total Worldwide Box Office Collection

వరల్డ్ వైడ్ గా ఎంతంటే: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి టోటల్ కలెక్షన్స్ ఏపీ, తెలంగాణలో రూ. 4.80 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 32 లక్షలు కలెక్షలతో క్లోజ్ అయింది. ఇలా వరల్డ్ వైడ్ గా మొత్తంగా ప్రదర్శించిన రోజుల్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకు రూ. 5.29 కోట్ల షేర్‌తో పాటు రూ. 10.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ రూ. 10 కోట్ల మార్క్ అందుకుని సత్తా చాటింది.

లాభం ఎంతంటే: ట్విస్టులు, లవ్, రొమాంటిక్ కాన్సెప్టుతో తెరకెక్కిన కిరణ్ అబ్బవరం మూవీ 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక ఈ చిత్రం టోటల్ కలెక్షన్స్ పూర్తవ్వగా.. మొత్తంగా రూ. 5.29 కోట్లు వచ్చాయి. అంటే ఈ సినిమా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 79 లక్షలు లాభం కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X