twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SR Kalyanamandapam 5Days Collections: చిన్న మూవీకి రికార్డు కలెక్షన్లు.. అప్పుడే అన్ని కోట్ల లాభాలు

    |

    సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ల గేట్లు జూలై 30 నుంచి తెరుచుకున్నాయి. ఆరోజు రెండు సినిమాలు 'తిమ్మరుసు', 'ఇష్క్' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, కరోనా భయానికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కాకోపోవడంతో వీటికి ప్రేక్షకుల ఆదరణ లభించినా.. కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. దీంతో మిగిలిన సినిమాల దర్శక నిర్మాతలు భయపడిపోయారు. ఈ నేపథ్యంలో తమ చిత్రాల విడుదలల గురించి పునరాలోచనలో పడ్డారు.

    ఇలాంటి పరిస్థితుల్లో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఎస్ఆర్ కల్యాణమండపం'. ఎన్నో ఆశల నడుమ వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్ల పంట పడుతోంది. దీంతో బాక్సాఫీస్‌కు పునర్వైభవం వచ్చినట్లైంది. ఈ మూవీ కలెక్షన్ల రిపోర్టు మీకోసం!

    ఆశలు రేపిన ‘ఎస్ఆర్ కల్యాణమండపం'

    ఆశలు రేపిన ‘ఎస్ఆర్ కల్యాణమండపం'

    యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'ఎస్ఆర్ కల్యాణమండపం'. శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. తండ్రి సెంటిమెంట్‌తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది ఆగస్టు 6న విడుదలైంది. ఎన్నో చిన్న పెద్ద సినిమాల విషయంలో ఇది ఆశలు రేపిందనే చెప్పాలి.

    Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!

    చిన్న చిత్రమే... కానీ రేంజ్ మాత్రం భారీ

    చిన్న చిత్రమే... కానీ రేంజ్ మాత్రం భారీ

    స్టార్ హీరో కాదు.. పేరున్న దర్శకుడూ కాదు.. అయితేనేం 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులోని పాటలు సినిమాను యూత్‌కు చేరువ చేశాయి. అలాగే, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ మూవీ అన్ని ఏరియాల రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఫలితంగా మీడియం రేంజ్ చిత్రాల మాదిరిగా ప్రీ బిజినెస్‌ను జరుపుకుని సత్తా చాటిందీ సినిమా.

    టాక్‌తో సంబంధం లేదు.. రోజుల వారీగా

    టాక్‌తో సంబంధం లేదు.. రోజుల వారీగా

    భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎస్ఆర్ కల్యాణమండపం' ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం రూ. 1.41 కోట్లు, రెండో రోజు రూ. 1.25 కోట్లు, మూడో రోజు రూ. 1.40 కోట్లు, నాలుగో రోజు రూ. 74 లక్షలు వసూలు చేసింది. ఫలితంగా మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్ స్టేటస్‌ను అందుకుని రికార్డు సృష్టించింది.

    తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులుతల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

    ఐదో రోజు ఎక్కడ? ఎంత రాబట్టిందంటే?

    ఐదో రోజు ఎక్కడ? ఎంత రాబట్టిందంటే?

    ఐదో రోజైన మంగళవారం కూడా 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా ఐదో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 60 లక్షలు షేర్‌తో పాటు రూ. 95 లక్షలు గ్రాస్‌ను రాబట్టిందీ చిత్రం. తద్వారా వీక్ డేస్‌లోనూ బాక్సాఫీస్‌పై స్టామినాను చూపించినట్లైంది.

    ఐదో రోజులకు ఎక్కడ? ఎంత వచ్చింది?

    ఐదో రోజులకు ఎక్కడ? ఎంత వచ్చింది?

    విడుదలైనప్పటి నుంచే మంచి స్పందనను అందుకుంటోన్న 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఐదు రోజులకు కలిపి నైజాంలో రూ. 2.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా ఐదు రోజులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 5.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.74 కోట్లు గ్రాస్‌‌ను రాబట్టిందీ మూవీ.

    Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇలా

    ప్రతికూల పరిస్థితులు ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ సత్తా చాటుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌లో ఓ రేంజ్‌లో హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. తద్వారా మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఎంతలా ఆదరిస్తారో అన్నది నిరూపించుకుంది. ఐదు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.40 కోట్లు షేర్‌‌ను రాబట్టిన ఈ చిత్రం కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 32 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఐదు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.86 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.83 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    Recommended Video

    Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. అప్పుడే అంత లాభం

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. అప్పుడే అంత లాభం

    'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఇక, ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 5.86 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 1.06 కోట్లు లాభాలను అందుకుని హిట్ చిత్రంగా నిలిచింది. ఇదే ఊపు కొనసాగితే ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    English summary
    Kiran Abbavaram Recently Did a Film SR Kalyanamandapam Under Sridhar Gade Direction. This Movie Collected Rs 5.40 CR Share in Five Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X