SR Kalyanamandapam 7Days Collections: ఏడో రోజూ అదే రేంజ్.. ఎంత లాభం వచ్చిందంటే!

మొదటి చిత్రం 'రాజావారు రాణి వారు'తోనే అందరి దృష్టిని ఆకర్షించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో వచ్చాడు. శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. తండ్రి సెంటిమెంట్‌తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆరంభం నుంచే 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ అంచనాలను ఏర్పరచుకుంది. దీనికి కారణం ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించడమే. అంతేకాదు, వీటి వల్ల ఈ మూవీ పేరు మారుమ్రోగిపోయింది. దీంతో దీనికి బిజినెస్ కూడా ఊహించని రీతిలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 4.55 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఫలితంగా మీడియం రేంజ్ చిత్రాల మాదిరిగా ప్రీ బిజినెస్‌ను జరుపుకుని సత్తా చాటిందీ సినిమా. ఈ లెక్కలకు సినీ విశ్లేషకులు అవాక్కయ్యారు.

 Kiran Abbavarams SR Kalyanamandapam Movie Day 7 collections Report

ఏడో రోజైన గురువారం కూడా 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.80 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1.70 లక్షలు, గుంటూరులో రూ. 3.10 లక్షలు, కృష్ణాలో రూ. 1.40 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా ఏడో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 37 లక్షలు షేర్‌తో పాటు రూ. 62 లక్షలు గ్రాస్‌ను రాబట్టిందీ చిత్రం. ఫలితంగా వీక్ డేస్‌లోనూ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.

ఫస్ట్ డే నుంచి సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటోన్న 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ బాక్సాఫీస్‌పై ఓ రేంజ్‌లో హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. తద్వారా మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఎంతలా ఆదరిస్తారో అన్నది నిరూపించుకుంది. ఫలితంగా ఏడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.22 కోట్లు షేర్‌‌ను రాబట్టింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 36 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఏడు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.75 కోట్లు షేర్‌‌ను వసూలు చేసి ఇంకా హవాను చూపిస్తూనే ఉందీ చిత్రం.

 Kiran Abbavarams SR Kalyanamandapam Movie Day 7 collections Report

'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఇక, ఏడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 6.75 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 1.95 కోట్లు లాభాలను అందుకుని హిట్ చిత్రంగా నిలిచింది. తద్వారా రెండు కోట్ల రూపాయల లాభాల దిశగా దూసుకుని పోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X