Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దుమ్మురేపుతున్న నిఖిల్.. తొలిరోజు కిరాక్ పార్టీ కలెక్షన్లు ఇవే..
వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో నిఖిల్‌కు మరో మంచి విజయాన్ని చేజిక్కించుకోబోతున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లోనే రికార్డు కలెక్షన్లను కిరాక్ పార్టీ చిత్రం ద్వారా సొంతం చేసుకొన్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నిర్మాత సుంకర రామబ్రహ్మం రూపొందించిన ఈ చిత్రం తొలిరోజు భారీ వసూళ్లను సాధించడం గమనార్హం. సంయుక్తా హెగ్డే, సిమ్రాన్ పరీంజాలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
నైజాం ఏరియాలో
కిరాక్ పార్టీ చిత్రం నైజాం ఏరియాలో 1.39 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్టులు అందుతున్నాయి. సీడెడ్‌లో ఈ చిత్రం 78 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 59 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.
ఏపీలో మంచి రెస్పాన్స్
ఇక కిరాక్ పార్టీకి ఏపీలో కలెక్షన్లపరంగా మంచి స్పందన కనిపించినట్టు సమాచారం. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో 38 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 28 లక్షలు, వైజాగ్‌లో 62 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. కృష్ణా జిల్లాలో రూ.31 లక్షలు, గుంటూరులో రూ.42 లక్షలు, నెల్లూరులో రూ.21 లక్షల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.
ఓవర్సీస్లో వసూళ్ల హవా..
కిరాక్ పార్టీ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం. తొలిరోజున అమెరికాలో రూ.48 లక్షలు వసూళు చేసినట్టు సమాచారం. ఒక నైజాం, ఏపీలో కలిపి నికరంగా రూ.1.63 కోట్లు, స్థూలంగా 2.9 కోట్లు వసూళు చేసినట్టు సమాచారం.
తొలిరోజే రూ.2.26 కోట్లు
ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా కిరాక్ పార్టీ 2.26 కోట్లు షేర్ని, రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు సమాచారం. ఈ మొత్తం నిఖిల్ కెరీర్లోనే అత్యధికం కావడం ఆయన స్టామినాకు అద్దం పట్టిందనే మాట వినిపిస్తున్నది.