Kis Kisko Pyaar Karoon 2 Day 1 Collections: కిస్ కిస్కో ప్యార్ కరో 2 కలెక్షన్స్.. కపిల్ శర్మ మూవీకి ఎంతంటే?

స్టాండప్ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి... ఇండియాలోనే స్టార్ ప్రెజెంటర్‌గా వెలుగుతున్నారు కపిల్ శర్మ. టెలివిజన్‌తో పాటు సినీ రంగంలో హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నారు. కిస్ కిస్కో ప్యార్ కరో, ఫిరంగి, జ్విగాటో తదితర సినిమాలలో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణించారు. తాజాగా కపిల్ శర్మ నటించిన చిత్రం కిస్ కిస్కో ప్యార్ కరో 2. గతంలో 2015లో వచ్చిన కిస్ కిస్కో ప్యార్ కరో మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కిస్ కిస్కో ప్యార్ కరో 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు కపిల్ శర్మ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

కిస్ కిస్కో ప్యార్ కరో 2 తారాగణం
కిస్ కిస్కో ప్యార్ కరో 2లో కపిల్ శర్మ, వారినా హుస్సేన్, మన్‌జ్యోత్ సింగ్, పారుల్ గులాటీ, ఆయేషా ఖాన్, త్రిదా చౌదరి, గోవర్ధన్ ఆశ్రానీ, సుశాంత్ సింగ్, మనోజ్ జోషి, శనయా కపూర్‌లు కీలకపాత్రలు పోషించారు. అనుకల్ప్ గోస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రవి యాదవ్ సినిమాటోగ్రాఫర్‌గా, హుస్సేన్ ఏ బర్మావాలా ఎడిటర్‌గా పనిచేశారు. యో యో హనీ సింగ్, యుగ్ భూశాల్, పరీక్షిత్, నిషాద్ యూసుఫ్ సంగీత దర్శకత్వం వహించారు. వీనస్ వరల్డ్ వైడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అబ్బాస్ అలీభాయ్ బర్మావాలా, మస్తాన్ అలీభాయ్ బర్మావాలా, గణేష్ జైన్, రతన్ జైన్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Kis Kisko Pyaar Karoon 2 Day 1 Expected Box Office Collections Worldwide Kapil Sharma s Movie Good start at GBOC

కిస్ కిస్కో ప్యార్ కరో 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కిస్ కిస్కో ప్యార్ కరో చిత్రం దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. తొలి భాగం కంటే దాదాపు 20 కోట్ల రూపాయల బడ్జెట్ అధికం. ఇక కిస్ కిస్కో ప్యార్ కరో చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో దాని సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కపిల్ శర్మ క్రేజ్ కూడా తోడు కావడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల రూపాయల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. కపిల్ శర్మ సినిమాను వరల్డ్ వైడ్‌గా 1000 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు.

కిస్ కిస్కో ప్యార్ కరో 2కి మంచి రెస్పాన్స్
బాలీవుడ్‌లో దురంధర్‌తో పాటు సౌత్‌లో అఖండ 2 వంటి భారీ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ డిసెంబర్ 12న కిస్ కిస్కో ప్యార్ కరో 2ను రిలీజ్ చేయడం గమనార్హం. ఈ టఫ్ ఫైట్‌లోనూ కపిల్ శర్మ సినిమాకు మంచి బుకింగ్స్ నమోదవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 12వ తేదీ మార్నింగ్ షోలలో.. ఈ చిత్రం మస్తి 4 కంటే మెరుగైన ప్రదర్శన చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాంతో కిస్ కిస్కో ప్యార్ కరో 2 మూవీకి తొలిరోజు మంచి ఓపెనింగ్స్ లభిస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

కిస్ కిస్కో ప్యార్ కరో 2 తొలిరోజు కలెక్షన్స్
కామెడీ బ్యాక్‌డ్రాప్ కావడంతో కుటుంబ ప్రేక్షకుల నుంచి కిస్ కిస్కో ప్యార్ కరో 2 మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కపిల్ శర్మ సినిమాకు డిసెంబర్ 12వ తేదీ రాత్రి 7 గంటల వరకు 10 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో 394 షోలు, ముంబైలో 263 షోలు, పూణేలో 104 షోలు, బెంగళూరులో 71 షోలు, హైదరాబాద్‌లో 76 షోలు, అహ్మదాబాద్‌లో 215 షోలు ప్రదర్శితమైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి కిస్ కిస్కో ప్యార్ కరో 2 మూవీకి తొలిరోజు ఇండియాలో 88 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. దాంతో ఫస్ట్ డే కపిల్ శర్మ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: kapil sharma box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X