Kisi Ka Bhai Kisi Ki Jaan day 1 అడ్వాన్స్ బుకింగ్ ఎంతంటే? తొలి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కిసి కా భాయ్.. కిసి కీ జాన్ చిత్రం అట్టహాసంగా రిలీజ్‌కు సిద్దమైంది. పూజా హెగ్డే, వెంకటేష్, భూమిక, రాంచరణ్ (అతిథి పాత్ర)లో నటించిన ఈ చిత్రం తమిళం విజయవంతమైన వీరమ్ (తెలుగులో కాటమరాయుడు) మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఈద్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

Kisi Ka Bhai Kisi Ki Jaan advance booking worldwide: Salman Khan movie opens with mixed response at Box office

సల్మాన్ ఖాన్‌కు వరుస ఫ్లాపులతో: సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే. గతంలో టైగర్ జిందా హై చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ తర్వాత వచ్చిన రేస్ 3, భారత్, దబాంగ్ 3, అంతిమ్: ది ఫైనల్ ట్రూత్ సినిమాలు పెద్దగా బాక్సాఫీస్‌ను ప్రభావితం చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాటమరాయుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నది. దాంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మల్టీ ఫ్లెక్స్ చైన్ థియేటర్లలో: కిసి కా భాయ్.. కిసి కీ జాన్ చిత్రానికి మల్టీప్లెక్స్‌ స్క్రీన్లలో భారీ స్పందన కనిపించింది. పీవీఆర్‌లో 7600 టికెట్లు, సినీ పోలీస్‌లో 3800 టికెట్లు, ఇతర మల్టీ ప్లెక్స్‌లో కలిపి ఈ చిత్రం 14500 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా రెండు రోజుల సమయం ఉంది కనుక.. ఈ సినిమాకు నేషనల్ మల్టీ ప్లెక్స్ చైన్ థియేటర్లలో మరింత అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.

Kisi Ka Bhai Kisi Ki Jaan advance booking worldwide: Salman Khan movie opens with mixed response at Box office

ఇండియాలో ఎన్ని టికెట్లు అమ్మడయ్యాయంటే: ఇక ఇండియాలో కిసి కా భాయ్.. కిసి కీ జాన్ చిత్రం భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకొన్నది. ఇండియాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన కనిపించింది. ఇప్పటి వరకు 1 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు ఉత్తరాదిలో ఈ సినిమాను 6175కి పైగా స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్ 1.92 కోట్లు నమోదైనట్టు సమాచారం.

ఓవర్సీస్‌ అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్: అలాగే కిసి కా భాయ్.. కిసి కీ జాన్ సినిమా ఓవర్సీస్‌లో కూడా ఓ మోస్తారు అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేసింది. అమెరికాలో ఈ చిత్రాన్ని 6 లొకేషన్లలో ప్రదర్శిస్తున్నారు. దాదాపు 28 షోల కోసం 120 టికెట్లు నమోదయ్యాయి. ఇక యూకేలో 15 లొకేషన్లలో 29 షోలకు, 360 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఆస్ట్రేలియాలో 69 షోలకు గాను, 125 షోలకు దాదాపు 440 టికెట్లు అమ్మడం జరిగింది.

Kisi Ka Bhai Kisi Ki Jaan advance booking worldwide: Salman Khan movie opens with mixed response at Box office

తొలి రోజు కలెక్షన్ల అంచనా: కిసి కా భాయ్.. కిసి కీ జాన్ తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ గత సినిమాలకు కనిపించిన రికార్డు అడ్వాన్స్ బుకింగ్ నమోదు కాలేదు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌తో కరెంట్ బుకింగ్ కలిపితే సుమారు 15 నుంచి 20 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X