Kisi Ka Bhai Kisi Ki Jaan Day 1 Collections సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే దారుణంగా..తొలి రోజు కలెక్షన్లు ఎంతటే

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన చిత్రం కిసి కా భాయ్ కిసి కీ జాన్. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన వీరమ్ (తెలుగులో కాటమరాయుడు) సినిమాకు రీమేక్‌.. పూజా హెగ్గే, విక్టరీ వెంకటేష్, పలక్ తివారీ, షెహనాజ్ గిల్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు నటించారు. ఏప్రిల్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ మూవీ బడ్జెట్ : తెలుగు నేటివిటీ బ్యాక్ డ్రాప్‌గా కిసి కా భాయ్ కిసి కీ జాన్ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వెంకటేష్, పూజా హెగ్డే, బాక్సర్ విజేందర్ సింగ్ లాంటి ప్రముఖులకు భారీ రెమ్యునరేషన్ చెల్లించారు. అంతేకాకుండా లాక్‌డౌన్ పరిస్థితులు, ఇతర అంశాలు ఈ సినిమా వ్యయం పెరిగేలా చేశాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారు 100 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kisi Ka Bhai Kisi Ki Jaan

వరల్డ్ వైడ్ థియేటర్ కౌంట్ : రంజాన్ పండుగ కానుకగా రిలీజైన కిసి కా భాయ్ కిసి కీ జాన్ చిత్రం రికార్డుస్థాయిలో థ్రియేట్రికల్ రిలీజ్ అయింది. దాదాపు 100 దేశాల్లో ఈ సినిమాను విడుదల చేశారు. తొలి రోజు ఇండియాలో 4500 స్క్రీన్లు, 16 వేల షోలు ప్రదర్శించారు. ఓవర్సీస్‌లో 1200 స్క్రీన్లలో విడుదల చేశారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

సల్మాన్ మూవీ ఆక్యుపెన్సీ : కిసి కా భాయ్ కిసి కీ జాన్ మూవీ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. గతంలో సల్మాన్ సినిమాల కంటే చాలా పేలవంగా నమోదైంది. ఈ సినిమాకు మార్నింగ్ షోకు 15 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నికి 20 శాతం, ఫస్ట్ షోకు 15 శాతం, మ్యాట్నీకి 17 శాతం కలెక్షన్లు నమోదయ్యాయి. సల్మాన్ ఖాన్ సినిమాకు ఇంత దారుణంగా ఆక్యుపెన్సీ నమోదు కావడం తన కెరీర్‌లో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు.

Kisi Ka Bhai Kisi Ki Jaan

ఓవర్సీస్‌లో కిసీ కా భాయ్ కలెక్షన్లు : తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. యూకేలో 15 లోకేషన్లలో 29 షోల ద్వారా 500 టికెట్లను అమ్మడం జరిగింది. ఇక అమెరికాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 246 లోకేషన్లలో 580 షోల ద్వారా 23K కలెక్షన్లను రాబట్టింది. ఆస్ట్రేలియాలో 71 లోకేషన్లలో 132 షోల ద్వారా 2560 టికెట్లు అమ్ముడయ్యాయి.

కిసి కా భాయ్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే? : సల్మాన్ ఖాన్ కెరీర్‌లో కిసి కా భాయ్ కిసి కీ జాన్ మూవీ అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గతంలో సల్మాన్ నటించిన చిత్రాలు తొలి రోజు కనీసం 40 కోట్లు రాబట్టిన దాఖలాలు ఉన్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే.. అడ్వాన్స్ బుకింగ్ చాలా పేలవంగా నమోదయ్యాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయల లోపు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X