Kisi Ka Bhai Kisi Ki Jaan collections సల్మాన్ ఖాన్ ధమాకా, భారీగా పెరిగిన వసూళ్లు: 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్, కిసీ కీ జాన్ ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేష్, పూజా హెగ్డే, జగపతి బాబు తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేగాన్ని పెంచింది.

వీరమ్, కాటమ రాయుడు సినిమాలకు రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ తొలి రోజు దారుణమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు నుంచి మెరుగైన కలెక్షన్లను సాధించింది. గత మూడు రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను సాధించిందనే విషయంలోకి వెళితే..

Kisi Ka Bhai Kisi Ki Jaan Day 3 Collections worldwide: Salman Khan shows commendable growth at box office

100 కోట్ల బడ్జెట్.. 5700 స్క్రీన్లు: కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీని దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌ సల్మాన్ ఖాన్ ఫిలింస్‌పై భారీ తారాగాణంతో తెరకెక్కించారు. బడ్జెట్‌కు తగినట్టుగానే ఈ సినిమాను దాదాపు 100 దేశాల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇండియాలోనే 4500 స్క్రీన్లలో, ప్రతీ రోజు 16 వేల షోలు ప్రదర్శిస్తున్నారు.

తొలి రోజు పేలవంగా: కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం తొలి రోజు సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువగా కలెక్షన్లు సాధించింది. ఇండియాలో ఈ సినిమా 13 కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 15.5 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఏ క్యాటగిరీ హీరో సాధించిన అత్యల్ప వసూళ్లు ఈ సినిమావే కావడం గమనార్హం.

Kisi Ka Bhai Kisi Ki Jaan Day 3 Collections worldwide: Salman Khan shows commendable growth at box office

2వ రోజు భారీగా వృద్ధి: సల్మాన్ ఖాన్ సినిమా తొలి రోజు చాలా తక్కువ వసూళ్లు రాబట్టడంతో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సల్మాన్ ఖాన్ సినిమా వసూళ్ల పరంగా పుంచుకోవడం కష్టమే అనే నేపథ్యంలో శనివారం భారీ వసూళ్లు రాబట్టింది. తొలి రోజు కంటే 93 శాతం వృద్ధిని సాధించింది. రెండో రోజు ఈ చిత్రం 25 కోట్లు ఇండియాలో, మరో 1.5 కోట్లు ఓవర్సీస్‌లో సాధించింది. దాంతో ఈ సినిమా రెండో రోజు 26.5 కోట్లు నమోదు చేసింది.

3వ రోజు సల్మాన్ ఖాన్ తడఖా: ఇక మూడో రోజు కూడా సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద అదే ఊపు కొనసాగించింది. ఈ చిత్రం రెండు రోజుల్లో 42 కోట్లు సాధించింది. ఇక మూడో రోజు అంతకు మించి వసూళ్లను రాబట్టింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఈ సినిమాకు భారీగా కలిసి వచ్చింది. ఈ చిత్రం ఇండియా వైడ్ మూడో రోజు 26.25 కోట్లు సాధించింది. ఓవర్సీస్‌లో మరో 1.5 వరకు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 27.75 కోట్లు వసూలు చేసింది.

Kisi Ka Bhai Kisi Ki Jaan Day 3 Collections worldwide: Salman Khan shows commendable growth at box office

మొత్తం మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?: కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీ గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 15.5 కోట్లు, రెండో రోజు 26.5 కోట్లు, మూడో రోజు 27.75 కోట్లు నమోదు చేసింది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం 69.75 కోట్లు వసూలు చేసింది. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం 100 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X