Kisi Ka Bhai Kisi Ki Jaan collections:డిజాస్టర్ టాక్ ఎదురించి 100 కోట్ల క్లబ్‌లో.. సల్మాన్ బాక్సాఫీస్ మ్యాజిక్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తున్నది. తొలి రోజు సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుంచి జెట్ స్పీడ్‌తో కలెక్షన్లు సాధిస్తున్నది. కాటమ రాయుడు, వీరమ్ చిత్రాలకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కించారు. తెలుగు నటులు వెంకటేష్, జగపతి బాబుతోపాటు పూజా హెగ్డే, బాక్సర్ విజయేంద్ర సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమా గత 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

125 కోట్ల బడ్జెట్‌తో :తమిళంలో అజిత్ నటించిన వీరమ్, తెలుగులో కాటమరాయుడు సినిమా ఆధారంగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాన్ని హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా తెరకెక్కించారు. ఈ సినిమాలో డజన్‌కుపైగా పాపులర్ ఆర్టిస్టులతో రూపొందించారు. హానీ సింగ్, రాంచరణ్ లాంటి వాళ్లు గెస్టులుగా మెరిశారు. దాంతో ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 125 కోట్లు బడ్జెట్ అయిందని సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారు 5700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Kisi Ka Bhai Kisi Ki Jaan Day 4 Collections worldwide: Salman Khan movie reached 100 crore mile stone

సల్మాన్ ఖాన్ మూవీ ఓపెనింగ్స్:సల్మాన్ ఖాన్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. భారత్ 42 కోట్లకుపైగా, ప్రేమ్ రతన్ ధన్ పాయో 40 కోట్లు, సుల్తాన్ 37 కోట్లు, టైగర్ జిందా హై 35 కోట్లు, ఏక్ థా టైగర్ 33 కోట్లు, రస్ 29 కోట్లు, భజరంగీ భాయ్‌జాన్ 28 కోట్లు, కిక్ చిత్రం 25 కోట్లు వసూలు చేశాయి. ఈ చిత్రం సల్మాన్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా 16 కోట్లకు మించి కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

డిజాస్టర్ టాక్ ఎదురించి:అయితే బాక్సాఫీస్ వద్ద సల్మాన్ ఖాన్ సినిమా డిజాస్టర్ అనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎదురించి ఈ చిత్రం రెండో రోజు నుంచి పుంజుకొన్నది. రెండో రోజు 26 కోట్లు, మూడో రోజు 27 కోట్లు సాధించింది. ఒక ఓవర్సీస్‌లో 4 మిలియన్లు అంటే దాదాపు 32 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఈ చిత్రం 100 కోట్ల మార్కుకు చేరువైంది.

Kisi Ka Bhai Kisi Ki Jaan Day 4 Collections worldwide: Salman Khan movie reached 100 crore mile stone

4 రోజుల్లో టోటల్ కలెక్షన్లు:ఇక కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం 4 రోజులు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 10.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం గత 4 రోజులల్లో 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో 82 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 32 కోట్ల గ్రాస్ వసూలుచేసింది. ఈ సినిమా సుమారు 65 షేర్ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X