Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కొబ్బరి మట్ట.. ఎన్టీఆర్ బయోపిక్‌ను మించి..
హృదయకాలేయంతో విశేషమైన ప్రేక్షకాదరణ కూడగట్టుకొన్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటుతున్నాడు. ఐదేళ్ల తర్వాత తన రెండో చిత్రం కొబ్బరి మట్ట తన రేంజ్‌కు మంచి వసూళ్లను సాధిస్తున్నది. గత రెండు రోజులుగా భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలను మరిపించేలా సంపూ వసూళ్లను కొల్లగొట్టడం సినిమా పరిశ్రమలో సెన్సేషన్‌గా మారింది. గత రెండు రోజుల్లో కొబ్బరి మట్ట ఎంత వసూలు చేసిందంటే..
ఏపీ, తెలంగాణలో
రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో సంపూ నటించిన కొబ్బరి మట్ట చిత్రం తొలి ఆట నుంచి సంచలనమైన రీతిలో వసూళ్లను రాబడుతున్నది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం 62 లక్షల నికర వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టడం సంపూ స్టామినాను చెప్పింది. రెండో రోజు రూ.63 లక్షల నికర వసూళ్లను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ఇక తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 71 లక్షల నికర వసూళ్లను సాధించింది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.32 కోట్ల నికర వసూళ్లు, 2.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సంపూ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ రికార్డు క్రియేట్ అయింది.
లాభాల్లోకి రావాలంటే
టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో కొబ్బరి మట్ట సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.2 కోట్లకుపైగా అమ్మడం జరిగింది. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.2.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
స్టార్ హీరోలకు ధీటుగా సంపూ
ఇక వారాంతంలో మన్మథుడు సినిమా కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయ పరిచింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పలువురు స్టార్ హీరోల సినిమాలు, ఎన్టీఆర్ బయోపిక్ కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టడం చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ సినిమా కలెక్షన్లు లాభాల బాట పడుతుందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.