‘కొచ్చాడియాన్ (విక్రమసింహ)’ కలెక్షన్స్ ఎంతంటే?

By Bojja Kumar

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తొలి ఇండియన్ మోషన్ కాప్చర్ యానిమేషన్ మూవీ కొచ్చాడయాన్ (తెలుగులో విక్రమ సింహ) ఓపెనింగ్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా తొలి రోజు క్వాలిటీ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా...రజనీకాంత్ అభిమానులు మాత్రం సినిమాను చూసేందుకు ఆసక్తి చూపారు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఎఫెక్టుతో తొలి 3 రోజుల్లో చిత్రం కలెక్షన్స్ ఫర్వాలేదనిపించాయి.

రజనీకాంత్ సినిమా కావడంతో తమిళనాడులో తొలి రోజు థియేటర్లన్నీ నిండాయి. దీంతో ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క చెన్నైలోనే రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు 90శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లన్నీ కళకళలాడాయి. ఆ తర్వాత రెండు రోజులు కూడా తమిళనాడులో మంచి ఫలితాలు వచ్చాయి. ట్రేడ్ నిపుణుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ వీకెండ్(శుక్ర, శని, ఆది) ఈ చిత్రం తమిళనాడులో రూ. 21 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Kochadaiiyaan (3 Days) First Weekend Collections At Box Office

కర్నాటకలో..
కర్నాటకలో కూడా కొచ్చాడియాన్ మంచి ఫలితాలు రాబట్టింది. తొలి రోజు థియేటర్లన్నీ 80 శాతం ఆక్యుపెన్సీసాధించాయి. అయితే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. మూడో(ఆదివారం) మళ్లీ పుంజుకుని 85 శాతం ఆక్యుపెన్సీ సాధించాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి కర్నాటకలో రూ. 1.30 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే కేరళలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ మళయాలం సినిమాల హవాతో కొచ్చాడయాన్ చిత్రానికి ఆదరణ లభించలేదు.

మిగతా వివరాలు స్లైడ్ షోలో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X