రజనీకాంత్‌కు షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు
హైదరాబాద్: రజనీకాంత్ సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగునాట కూడా బాగా ఆడుతాయి. అందుకే ఆయన సినిమాల తెలుగు రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోతుంటాయి. అయితే తాజాగా విడుదలైన 'విక్రమ సింహ' చిత్రం మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. బాక్సాఫీసు వద్ద విక్రమ సింహ కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.
అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రంతో పాటు ఈ నెల 23న విడుదలైన 'విక్రమ సింహ' బాక్సాఫీసు వద్ద పూర్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. వాస్తవానికి ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయనగానే.....రజనీకాంత్ సినిమాతో అక్కినేని మల్టీస్టారర్ మూవీ 'మనం' పోటీ పడగలదా? అనే అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. 'మనం' చిత్రం ధాటికి విక్రమ సింహ' బోల్తా పడింది.

తొలి వారాంతం ముగిసే నాటికి 'మనం' చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5.32 కోట్లు వసూలు చేయగా....'విక్రమ సింహ' చిత్రం కేవలం 2.8 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ అనాలసిస్ట్ త్రినాథ్ తెలిపారు. అయితే తమిళ వెర్షన్ 'కొచ్చాడయాన్' మాత్రం తమిళనాటు మంచి వసూళ్లు రాబడుతోంది.
రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈచిత్రం తొలివారాంతం ముగిసే నాటికి రూ. 42 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందని, ఇండియాలో రూ. 30 కోట్లు వసూలయ్యాయని, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లు వసూలు చేసిందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications











