ఏడాదిలో 223 సినిమాలు ఫ్లాప్ .. 1000 కోట్ల నష్టం, కమల్ , రజనీ వాటా ఎన్ని కోట్లంటే?

రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని సినిమా థియేటర్‌లో కూర్చోబెట్టడం అంత తేలిక కాదు. కాకలు తీరిన దర్శక నిర్మాతలే బొక్కబోర్లా పడిన సందర్భాలు ఎన్నో. ప్రేక్షకులకు కావాల్సింది ఏంటో? ఎలా తీస్తే సినిమా హిట్ అవుతుందో తెలిసినవాడే ఈ రేసులో విజయం సాధిస్తాడు. పక్కా బిజినెస్ లాంటి సినీ పరిశ్రమలో హిట్ అంటే కొలమానాలు మారిపోయాయి. గతంలో 175 రోజులు, 100 రోజులు ఆడితేనే ఆ సినిమా హిట్ అయినట్లు.. కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు రాబట్టింది అన్న దానిని బట్టి సినిమా హిట్ అయ్యిందో? ఫ్లాప్ అయ్యిందో చెబుతున్నారు.

భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రతి యేటా వేల కొలది సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఇందులో మేజర్ షేర్ మాత్రం హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఇండస్ట్రీలదే . ఇప్పుడు హిట్లు, వసూళ్లతో తెలుగు చిత్ర పరిశ్రమ.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా కల్చర్ అందుబాటులోకి వచ్చాక టాలీవుడ్ మార్కెట్ పరిధి ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది. కొత్త కొత్త దర్శకులు, విభిన్న కథలతో మన సినిమాలు ఆకట్టుకుంటున్నాయి.

kollywood box office report 1000 Crore Loss in 2024 Amid 223 Flops

ఇదిలాఉండగా .. ఒకప్పుడు హిందీ చిత్రాలతో పోటీపడిన తమిళ చిత్ర పరిశ్రమ ఎందుకో స్లో అయ్యింది. భారీ బడ్జెట్ చిత్రాలు ఒకదాని తర్వాత మరొకటి ఫ్లాప్ అవుతూ నష్టాలను మిగులుస్తున్నాయి. 2024 సంవత్సరం కోలీవుడ్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ ఏడాది ఏకంగా 241 చిత్రాలు కోలీవుడ్ నుంచి విడుదలవ్వగా.. కేవలం 18 మాత్రమే హిట్ అయ్యాయంటే తమిళ పరిశ్రమ పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫ్లాప్స్ ద్వారా ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా నష్టాలను మూటకట్టుకుంది కోలీవుడ్.

మొత్తం 241 చిత్రాలకు గాను తమిళ నిర్మాణ సంస్థలు రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టగా.. రూ.2000 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ స్థాయి నష్టాలకు పెద్ద హీరోల సినిమాలే కారణమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అగ్ర నటులు కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య నటించిన చిత్రాల వాటానే ఈ నష్టాల్లో అత్యథికమట. కమల్ హాసన్ - శంకర్‌ల భారతీయుడు 2‌ను దాదాపు రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించగా.. రూ. 150 కోట్ల లోపే చాప చుట్టేసింది ఈ సినిమా.

kollywood box office report 1000 Crore Loss in 2024 Amid 223 Flops

కోలీవుడ్ బాహుబలిగా ప్రచారం పొందిన సూర్య నటించిన కంగువా మిగిల్చిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ. 106 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెప్పడంతో సూర్య కొట్టిన దెబ్బ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ కూడా నష్టాలు తీసుకొచ్చినా కాస్తలో కాస్త నయమని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 241 సినిమాల్లో 150 చిత్రాలకు ప్రమోషన్ ఖర్చులు కూడా రాలేదంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

పెద్ద హీరోల సినిమాలు ఇలా షాకిస్తే.. చిన్న సినిమాలు మాత్రం కోలీవుడ్ పరువు నిలబెట్టాయి. అమరన్ , గరుడన్, లబ్బర్ పండు, డిమాంటీ కాలనీ 2, వాజై , మహారాజ , మదగజరాజ, కుటుంబస్థాన్ వంటి చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో 2025పై తమిళ చిత్ర పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం నాటి విశాల్ నటించిన మదగజరాజ మంచి వసూళ్లతో ఈ ఏడాదిని ప్రారంభించడం శుభ శకునంగా విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: kollywood box office movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X