Konda Polam day 3 collections..రకుల్ ప్రీత్‌కు ముఖం చాటేసిన ప్రేక్షకులు.. క్రిష్ మూవీకి దారుణంగా కలెక్షన్లు
ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన కొండ పొలెం సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్టు కనిపిస్తున్నది. ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్, సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మూడో రోజున ఎంత వసూలు చేసిందంటే..

సెలవు దినం రోజున కూడా..
తెలుగు రాష్ట్రాలో కొండ పొలం చిత్రం తొలి రోజున రూ.1.34 కోట్లు నికరంగా, రూ.195 కోట్ల గ్రాస్ కలెక్షన్లను, రెండో రోజున రూ.1.94 కోట్లు నికరంగా రూ.2.91 కోట్ల స్థూల వసూళ్లను సాధించింది. ఇక సెలవు దినం ఆదివారం నాడైన మూడో రోజు కొండ పొలం మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఏపీ, నైజాం రాష్ట్రాల్లో రూ.77 లక్షలు నికరంగా. రూ.1.2 కోట్లు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

3వ రోజున కొండ పొలం కలెక్షన్లు
ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా కొండపొలం చిత్రం 3వ రోజున ఈ విధంగా కలెక్ట్ చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.24 లక్షలు, సీడెడ్‌లో రూ.10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.12 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.5 లక్షలు, గుంటూరులో రూ.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 6.3 లక్షలు, నెల్లూరులో రూ.5 లక్షలు వసూలు చేసింది.

ఓవరాల్‌గా మూడు రోజుల్లో
ఇక మొత్తంగా 3 రోజుల్లో కొండ పొలం సినిమా నైజాంలో రూ.72 లక్షలు, సీడెడ్‌లో రూ.29 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.52 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.27 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.21 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ.16 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.2.71 కోట్లు నికరంగా, రూప4.11 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బెంగళూరులో కొండ పొలం చిత్రం రూ.10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.14 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.2.95 కోట్లు నికరంగా, రూ. 4.75 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ వినూత్నమైన ప్రేమ కథకు పెద్దగా ఇతర రాష్ట్రాల్లో స్పందన కనిపించలేదు. దాంతో ఈ చిత్రం నిరాశకు గురిచేసిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

5 కోట్లు వసూలు చేస్తే లాభాల్లోకి
ఇక కొండ పొలం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.7.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.8 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి సుమారు 3 కోట్లు రాబట్టింది. అయితే ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్లకుపైగా రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వసూలు చేస్తున్న పరిస్థితిని చూస్తే కొండ పొలం చిత్రం నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది.


Click it and Unblock the Notifications











