Kotabommali P.S 2 Days Collections: కుమ్మేసిన కోటబొమ్మాళి.. 2వ రోజు ఊహించని వసూళ్లు.. ఎంత రావాలంటే!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విభిన్నమైన జోనర్లలో సినిమాలు వస్తున్నాయి. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇంకాస్త ఎక్కువగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'. సందేశాత్మక కథతో.. మిస్టరీతో జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది.
అందుకు తగ్గట్లుగానే ఇది మొదటి రోజు డీసెంట్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. శనివారం అయితే ఈ చిత్రం కుమ్మేసింది. ఈ నేపథ్యంలో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ రెండు రోజుల వసూళ్లపై ఓ లుక్కేద్దాం పదండి!

క్రేజీ స్టోరీతోనే కోటబొమ్మాళి: శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'. తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళి శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

కోటబొమ్మాళి బిజినెస్ ఎంత?: ఇన్వెస్టిగేటివ్ స్టోరీతో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 3 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.

2వ రోజు తెలుగులో ఎంత?: మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నాయట్టు' అనే సినిమాకు రీమేక్‌గా వచ్చిందే 'కోటబొమ్మాళి పీఎస్'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ డీసెంట్‌గా వచ్చాయి. అయితే, శనివారం ఇది మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. తద్వారా రెండో రోజు దీనికి రూ. 75 లక్షలు షేర్ వసూలు అయింది.
2 రోజులకూ కలిపి ఎంతంటే: ఉత్కఠను రేపే సబ్జెక్టుతో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి టాక్‌కు అనుగుణంగానే స్పందన వస్తోంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ చిత్రం మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుని వసూళ్లు భారీగా రాబట్టింది. ఫలితంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో రూ. 1.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ కమర్షియల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 2 రోజుల్లో రూ. 35 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1.55 కోట్లు షేర్, 3.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: 'కోటబొమ్మాళి పీఎస్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 3.50 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 రోజుల్లో దీనికి రూ. 1.55 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 1.95 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











