Kotabommali P.S 5 Days Collections: చిన్న మూవీకి ఊహించని వసూళ్లు.. 13 లక్షలు వస్తే సంచలనమే!
చాలా ఏళ్ల నుంచే క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా అలాంటి చిత్రాలు భారీ విజయాలను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'.
సస్పెన్స్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఇది మొదటి రోజు డీసెంట్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. వీక్ డేస్‌లో మాత్రం ఇది డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ ఐదు రోజుల వసూళ్లపై ఓ లుక్కేద్దాం పదండి!

క్రేజీ కాన్సెప్టుతో కోటబొమ్మాళి: శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'. తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళి శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేశారు.

కోటబొమ్మాళి బిజినెస్ ఎంత?: సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 3 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

5వ రోజు తెలుగులో ఎంత?: మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న 'నాయట్టు' అనే సినిమాకు రీమేక్‌గా వచ్చిందే 'కోటబొమ్మాళి పీఎస్'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ డీసెంట్‌గా వచ్చాయి. అయితే, క్రమంగా వసూళ్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఐదో రోజు దీనికి రూ. 31 లక్షలు షేర్ వసూలు అయింది.
5 రోజులకూ కలిపి ఎంతంటే: విభిన్నమైన కథతో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి టాక్‌కు అనుగుణంగానే స్పందన వస్తోంది. దీంతో అనుకున్న విధంగానే దీనికి డీసెంట్ కలెక్షన్లు కూడా సొంతం అవుతున్నాయి. ఫలితంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి 5 రోజుల్లో నైజాంలో రూ. 1.18 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.65 కోట్లతో కలుపుకుని రూ. 2.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: శ్రీకాంత్ లీడ్ రోల్‌లో నటించిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ కమర్షియల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 5 రోజుల్లో రూ. 54 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 3.37 కోట్లు షేర్, 6.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: 'కోటబొమ్మాళి పీఎస్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 3.50 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5 రోజుల్లో దీనికి రూ. 1.55 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 13 లక్షలు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











