Kotabommali P.S 8 Days Collections: కుమ్మేసిన కోటబొమ్మాళి.. 8 రోజుల్లోనే అన్ని కోట్లు.. లాభం ఎంతంటే!
తెలుగులో ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్‌లో సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటికి ప్రేక్షకులు మంచి స్పందనను అందించడంతో దర్శక నిర్మాతలు మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవలే అలా ఆడియెన్స్ ముందుకు వచ్చిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'. క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఇది మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం డౌన్ అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ 8 రోజుల వసూళ్లను చూద్దామా!
క్రేజీ స్టోరీతోనే కోటబొమ్మాళి
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీనే 'కోటబొమ్మాళి పీఎస్'. తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళి శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలను చేశారు.

కోటబొమ్మాళి బిజినెస్ ఎంత?
థ్రిల్లింగ్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
8వ రోజు తెలుగులో ఎంత?
మలయాళ పరిశ్రమ నుంచి వచ్చి విజయం సాధించిన 'నాయట్టు' అనే సినిమాకు రీమేక్‌గా వచ్చినదే 'కోటబొమ్మాళి పీఎస్'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ డీసెంట్‌గా వచ్చాయి. కానీ, తర్వాత డల్ అయిపోయింది. ఈ క్రమంలోనే 8వ రోజు ఈ సినిమాకు రూ. 7 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

8 రోజులకూ కలిపి ఎంతంటే
అదిరిపోయే కాన్సెప్టుతో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి టాక్‌కు అనుగుణంగానే స్పందన వస్తోంది. దీంతో అనుకున్న విధంగానే దీనికి డీసెంట్ కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఫలితంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి 8 రోజుల్లో నైజాంలో రూ. 1.29 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.82 కోట్లతో కలుపుకుని రూ. 3.11 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఎన్నో అంచనాలతో వచ్చిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ కమర్షియల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 8 రోజుల్లో రూ. 60 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 3.71 కోట్లు షేర్, 7.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
'కోటబొమ్మాళి పీఎస్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 3.50 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 8 రోజుల్లో దీనికి రూ. 3.71 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21 లక్షలు లాభాలు కూడా లభించాయి.


Click it and Unblock the Notifications











