Kotabommali P.S Day 1 Collections: కోటబొమ్మాళికి ఊహించని వసూళ్లు.. ఫస్ట్ డేనే ఇలా వచ్చాయంటే!
అన్ని జోనర్ల కంటే క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో వచ్చే సినిమాలకు తెలుగులో మంచి స్పందన వస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అవడంతో.. ఫిల్మ్ మేకర్లు అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీనే 'కోటబొమ్మాళి పీఎస్'. ఇన్వెస్టిగేటివ్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే డీసెంట్ రెస్పాన్స్‌ను ఇది సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ మొదటి రోజు వసూళ్లపై ఓ లుక్కేద్దాం పదండి!
కోటబొమ్మాళి అంటూ వచ్చారు
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో నటించిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'. తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళి శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలను పోషించారు.

కోటబొమ్మాళి బిజినెస్ ఎంత?
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 3 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
అలాంటి టాక్.. డీసెంట్‌గానే
ఆలోచింపజేసే కథతో విభిన్నమైన నేపథ్యంతో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించినట్లుగానే డీసెంట్‌గా వచ్చింది. దీంతో తొలి రోజు 'ఆదికేశవ' మూవీ నుంచి పోటీ ఉన్నా ఇది మంచి ఓపెనింగ్స్‌ను అందుకుందని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాలో ఎంతంటే
విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న విధంగానే రెస్పాన్స్ లభించింది. ఇలా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 45 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. అలాగే, ఈ చిత్రానికి రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 90 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ కమర్షియల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి తొలి రోజు రూ. 15 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 60 లక్షలు షేర్, 1.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
'కోటబొమ్మాళి పీఎస్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 3.50 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే దీనికి రూ. 60 లక్షలు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 2.90 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











