టాఫ్ చెయిర్ లో ఆ సినిమానే(ట్రేడ్ టాక్)

ఇక తర్వాత వారం రిలీజైన త్రీ సినిమా పునర్జన్మ బేస్ గా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే గురువారం రిలీజైన కేక సినిమా పరమ చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక శుక్రవారం రిలీజైన హీరో,కాశీ పట్నం చూడర బాబు కూడా బ్యాడ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే అదే రోజు రిలీజైన అల్లరి నరేష్ బ్లేడు బాబ్జీ బాగుందనీ మరో రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇక ఇవన్నీ కొత్త బంగారు లోకం సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయి. ముఖ్యంగా కేక ప్లాఫ్ కొత్త బంగారు లోకం వారిని పూర్తి స్ధాయిలో ఊపిరిపీల్చుకునేలా చేసింది.
ఇక అంతకు ముందు కౌసల్యా సుప్రజా రామా...సురేష్ ప్రొడక్షన్స్ వారి మారిన టేస్ట్ ని ముందుకు పెట్టి విమర్శకులకు గురి చేసింది. నేను మీకు తెలుసా ఓపినింగ్స్ బాగానే సంపాదించినా ఎదురు డబ్బిచ్చి...అన్న వ్యవహారమని అంతా తిట్టుకుంటూ బయిటకు వస్తున్నారు. నిన్న నేడు రేపు సినిమా కయితే ఆ ప్లాబ్లమే లేదు. ఎందుకంటే ఎవరన్నా చూస్తేనే కదా తిట్టుకోవటమో మెచ్చుకోవటమో చేసేది. కాబట్టి దానికా సమస్యేలేదు.
రెయిన్ బో లక్కీగా మొదటిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తర్వాత టెన్షన్ లేకుండా. అలాగే గోపీచంద్ శౌర్యం ఓ మాదిరి హిట్టనిపించుకుని బి,సి సెంటర్స్ కి తరలి పోయింది. అయితే ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ డౌన్ అవుతున్నాయని తెలుస్తోంది. రక్ష గురించి దర్శక,నిర్మాతలు తప్ప మాట్లాడే వాళ్ళు కరువయ్యారు.వీటిల్లో అష్టాచెమ్మ సినిమానే జెన్యూన్ గా హిట్టుని నమోదు చేసింది.హరేరామ్ వందరోజులు పండుగ ఫ్లాఫ్ అయినా ఈ వారం చేసుకుంది.


Click it and Unblock the Notifications











