హిట్ అనుకోవాలని యాభై రోజుల పోస్టర్ వేసారు

By Srikanya

హైదరాబాద్ : గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రం మార్నింగ్ షో కే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ బాగున్నాయని నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ మరీ చెప్పారు. ఈ రోజు యాభై రోజులు పూర్తైందని పోస్టర్ సైతం వదిలారు. అల్లు శిరీష్ రెండో చిత్రాన్ని హిట్ అని అనిపించాలనే ఈ తాపత్రయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు.

ఈ చిత్రం కథేమిటంటే... టీవీ ఛానెల్ లో పనిచేసే శిరీష్(అల్లు శిరీష్) ,సువర్ణ(రెజీనా) ఇద్దరూ బాగా స్వార్ధపరులు...కానీ టాలెంటెడ్. వీళ్ళిద్దరూ టీఆర్పీలు లేక మూలన పడిన ఓ తెలుగు ఛానెల్ ని నిలబెట్టి నెంబర్ వన్ చేయటానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది. అందులో భాగంగా కొత్త జంట అనే పోగ్రాం డిసి ఒకటి చేస్తారు. ఆ పోగ్రాం లక్ష్యం... కుల,మత,వర్ణ,వర్గ,పేదా,ధనిక తారతమ్యం తో పెళ్లిళ్లలకు ఇబ్బందులు ఎదరువుతున్న జంటలకు తమ ఛానెల్ లో లైవ్ పోగ్రాం తో పెళ్లిళ్లు చేయటం. అలా పెళ్ల్ళిళ్లు చేస్తే గొడవలు జరిగి, తమకు టీఆర్పీలు వస్తాయని ప్లాన్. అనుకున్నట్లుగానే ఆ పోగ్రాం సక్సెస్ అవుతుంది. అయితే ఊహించని విధంగా శత్రువులను తెచ్చి పెడుతుంది.

Kotha Janta Completes 50 Days Today

మరో ప్రక్క బిజినెస్ మ్యాన్(పోసాని)కి సువర్ణ అంటే ఇష్టం. ఆమెతో గడపాలనుకునే అతను కొత్త ఛానెల్ లాంచ్ చేస్తానని శిరీష్ ని పిలిచి మంచి జీతంతో కెరీర్ ఆఫర్ ఇస్తాడు. అయితే సువర్ణని తీసుకురావాలని కండీషన్ పెడతాడు. అయితే పోసాని ఇంటెన్షన్ అర్దం చేసుకున్న సువర్ణ ...ఆ ప్రపొజల్ కు నో చెప్తుంది. కానీ అప్పటికే పోసాని ఇచ్చే డబ్బుతో ప్రేమలో ఉన్న శిరీష్....ఆమెను ఎలాగైనా ఒప్పించటానికి ఆమెని ప్రేమిస్తున్నానని నాటకం ఆడతాడు. అది నిజమని నమ్మిన శిరీష ...అతనితో ప్రేమలో నిజంగానే పడుతుంది. అప్పుడు ఏమైంది... నిజం ఆమె ఎప్పుడు తెలుసుకుంటుంది...చివరకు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేది సినిమాటెక్ గా జరుగుతుంది.

మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు . అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేసా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.

నిర్మాత మాట్లాడుతూ ''ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు''అన్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేసారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. మధురిమ, మధు, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, రోహిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X