Krack Box office.. వేసింది రెండు షోలే వచ్చింది ఎంతంటే.. మొదటి రోజు లెక్కలివే!!

క్రాక్ సినిమా విడుదల విషయంలో ఎంత గందరగోళం నెలకొందో అందరికీ తెలిసిందే. మామూలుగా సంక్రాంతి బరిలోకి దిగుతున్న మొదటి పెద్ద సినిమా, ఓపెనింగ్ అదిరిపోవాలని అంతా ప్లాన్ చేశారు. కానీ చివరకు మొత్తం తలకిందులైంది. బెనిఫిట్, ప్రీమియర్ షోలు అన్నీ కూడా రద్దయ్యాయి. మార్నింగ్ షో, మ్యాట్నీల వరకు కూడా సమస్య తీరలేదు. ఇక సినిమా విడుదల ఉండదని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ చివరకు క్రాక్ థియేటర్లోకి వచ్చేసింది. దుమ్ములేపేసింది.

 రెండు షోలతో రచ్చ..

రెండు షోలతో రచ్చ..

నిన్న సాయంత్రం ఫస్ట్ షో నుంచి క్రాక్ సినిమా థియేటర్లలో సందడి చేసింది. కొన్ని చోట్ల ఒకే షో పడింది. అయితే మొత్తంగా నిన్న అన్ని అడ్డంకులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రవితేజ అభిమానులు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు థియేటర్ల వద్ద ఎదురుచూడసాగారు. చివరకు రెండు షోలతో అభిమానులు రచ్చ చేశారు.

కోవిడ్ నిబంధనలు..

కోవిడ్ నిబంధనలు..

క్రాక్ సినిమాకు ఫస్ట్ డే అంటూ ఓపెనింగ్ రికార్డులంటూ అన్నీ లెక్కలు వేసుకున్నారు. అందులోనూ మళ్లీ కోవిడ్ నిబంధనల్లో భాగంగా యాభై శాతం ఆక్యుపెన్సీకే అనుమతిచ్చారు. ఇన్ని సమస్యల మధ్య క్రాక్‌కు మరోసమస్య రావడం, మొదటి రెండు ఆటలు రద్దయ్యాయి. అయినా కూడా క్రాక్‌కు మొదటి రోజు మంచి కలెక్షన్లే వచ్చినట్టు తెలుస్తోంది.

ఏరియా వారిగా..

ఏరియా వారిగా..

క్రాక్ చిత్రానికి నైజాంలో 23 లక్షలు వచ్చాయి. సీడెడ్‌లో తక్కువ షోలు పడటంతో ఐదు లక్షలే వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో ఆరు లక్షలు, ఈస్ట్‌లో 5.2లక్షలు, వెస్ట్‌లో 3.2లక్షలు, గుంటూరులో 5 లక్షలు, కృష్ణాలో 6.4 లక్షలు నెల్లూరు మూడు లక్షలు వచ్చాయి.

 మొత్తంగా ఎంతంటే..

మొత్తంగా ఎంతంటే..

చివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే కోటికిపైగా గ్రాస్‌ను సాధించింది. ఇది కేవలం రెండు షోలతో వచ్చిన డబ్బే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ నికరంగా సాధించిన షేర్ 57 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఇక నేటి నుంచి క్రాక్ వసూళ్లలో దూసుకుపోయేలా ఉంది.

Recommended Video

Krack Movie First Day Collections | Raviteja మేనియా అంటే ఇదీ !
సంక్రాంతి హిట్..

సంక్రాంతి హిట్..

సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్‌కు మంచి శకునమే ఎదురైంది. క్రాక్ రూపంలో మొదటి హిట్ పడింది. ఇక వసూళ్లలోనూ క్రాక్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. నాలుగైదు రోజు కేవలం క్రాక్ సందడే కనిపించేలా ఉంది. ఎందుకంటే జనవరి 13న మాస్టర్, 14న RED చిత్రాలు రాబోతోన్నాయి. అప్పటి వరకు క్రాక్ అల్లాడించే అవకాశాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X