Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Box office: మొత్తానికి హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా.. క్రాక్ తెచ్చిన లాభాలు ఎంతంటే?
మాస్ మహా రాజా కష్టాల్లో ఉన్న బాక్సాఫీస్ కు ఒక్కసారిగా ఎనర్జీని అందించాడు. అసలు జనాలు థియేటర్స్ వరకు వస్తారా లేదా అని అనుకున్న అనుమానాలు మధ్య క్రాక్ ఇచ్చిన బూస్ట్ అందరికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. సంక్రాంతికి కరెక్ట్ సినిమా వస్తే కలెక్షన్స్ ఏ స్థాయిలో పెరుగుతాయో మరోసారి క్లారిటీ వచ్చేసింది. పాజిటివ్ టాక్ వస్తే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గవని అర్ధమయ్యింది. ఇక ఆ సినిమా తెలుగు కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
అసలు పరీక్ష అప్పుడే మొదలైంది
ఫైనల్ గా హాలిడేస్ ముగిశాయి. ఇక సోమవారం నుంచే సినిమాలకు అసలు పరీక్ష మొదలైంది. ఆదివారం వరకు బాగానే ఉన్న కలెక్షన్స్ ఒక్కసారిగా సోమవారం నుంచి తగ్గుతూ వచ్చాయి. అయితే క్రాక్ సినిమా కలెక్షన్స్ మాత్రం పెద్దగా తగ్గలేవు. ఆ సినిమా మొదటి రోజు నుంచి కూడా పాజిటివ్ గానే ముందుకు సాగుతోంది.
12 రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్
10రోజులైనా కూడా క్రాక్ కలెక్షన్స్ కోటికి తగ్గలేదు. 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే 94లక్ష షేర్స్ వచ్చాయి. ఇక క్రాక్ తరువాత వచ్చిన రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలకు సోమవారం నుంచి లక్షల్లోనే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ రవితేజ సినిమా మాత్రం మొన్నటి వరకు కోటికి పైగా షేర్స్ అందుకుంటూ అదే ఫ్లోలో ను కొనసాగిస్తోంది. ఒక విధంగా టాలీవుడ్ కు క్రాక్ మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి.
28కోట్లకు పైగా షేర్స్
మొదటి రోజు నుంచి కూడా క్రాక్ కలెక్షన్స్ అంత ఈజీగా అయితే తగ్గింది లేదు. మొదటిరోజే కాస్త ఆలస్యంగా విడుదల అవ్వడం అలాగే 50% ఆక్యుపెన్సీతో ఉన్న వినిమాకు అసలు కలెక్షన్స్ ఎలా వస్తాయి అనేది నిర్మాతల్లో ఒక భయాన్ని కలిగించింది. ఇక ఇప్పటికే నిర్మాతలకు 28కోట్లకు పైగా షేర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా
క్రాక్ సినిమా వరల్డ్ వైడ్ గా 13రోజుల్లో 50కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకున్నట్లు సమాచారం. ఇక షేర్స్ ప్రపంచ వ్యాప్తంగా 30కోట్లకు పైగా వచ్చాయి. ప్రస్తుతం 12కోట్లకు పైగా కలెక్షన్స్ తో సినిమా ప్రాఫిట్ జోన్ లో కొనసాగుతోంది. అలాగే నేటి నుంచి సినిమా థియేటర్స్ సంఖ్య కూడా పెరగనుంది. మరి మాస్ రాజా ఇంకా ఏ స్థాయిలో లాభాలను అందిస్తాడో చూడాలి.