Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
KRACK Box office: మాస్ రాజా పని పూర్తయ్యింది.. క్లోజింగ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే
మాస్ మహా రాజా రవితేజ క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ కు మంచి బూస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. కోవిడ్ కష్టకాలంలో సగం జనాలు థియేటర్స్ వరకు రావడమే గొప్ప అనుకున్న తరుణంలో ఎన్నో అనుమానాలు మధ్య క్రాక్ తెచ్చిన కలెక్షన్స్ అందరికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. సంక్రాంతికి సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయో మరోసారి క్లారిటీ వచ్చేసింది. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా మూవీ మొత్తానికి పని పూర్తి చేసుకుంది. క్రాక్ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
దర్శకుడు నమ్మినట్లే..
సంక్రాంతి హాలిడేస్ ముగిసినన తరువాత కూడా కొన్ని రోజుల వరకు క్రాక్ హవా గట్టిగానే కొనసాగింది. వీకెండ్స్ తో పాటు చాలా వరకు నార్మల్ డేస్ లో కూడా బాగానే వచ్చాయి. అయితే క్రాక్ సినిమా కలెక్షన్స్ మాత్రం పెద్దగా తగ్గలేవు. దర్శకుడు నమ్మినట్లే సినిమా థియేట్రికల్ అనుభూతిని ఇచ్చింది. ఇక ఓటీటీ విడుదలైనప్పటికి కూడా కొన్ని చోట్ల కలెక్షన్స్ తగ్గలేదు.
ఫుల్ ఆక్యుపెన్సీ ఉండి ఉంటే..
డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత మధు నిర్మించారు. రవితేజ కెరీర్ లోనే కాకుండా దర్శకుడికి కూడా ఇది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్. విడుదలైన 10రోజుల తరువాత కూడా తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్స్ అంసించాయి. కేవలం 50ఆక్యుపెన్సీతో ఉన్నపుడే ఒక బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందుకున్న ఈ సినిమా ఒకవేళ థియేటర్స్ ఫుల్ గా నడిచినప్పుడు రిలీజ్ చేసి ఉంటే సక్సెస్ మరో రేంజ్ లో ఉండేదని చెప్పవచ్చు.
పోటీగా కొత్త సినిమాలు వచ్చినా
ఇక క్రాక్ తరువాత వచ్చిన రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు మాస్ రాజా మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ సినిమాలకు వారం ముగిసే సరికి లక్షల్లోనే కలెక్షన్స్ వచ్చాయి. కానీ రవితేజ సినిమా మాత్రం 15రోజులైనా కోటికి పైగా షేర్స్ అందుకుంటూ అదే ఫ్లోను కొనసాగించింది. ఒక విధంగా టాలీవుడ్ కు క్రాక్ మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి.
39.25కోట్లకు పైగా షేర్స్
ఫైనల్ గా క్రాక్ సినిమా థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. ఇక సినిమా ఫుల్ రన్ టైమ్ లో అందుకున్న మొత్తం షేర్స్ 39.25కోట్లు. తెలంగాణ ఏపీలోనే సినిమాకు 36కోట్ల వరకు వచ్చాయి. ఇక మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 70కోట్లని తెలుస్తోంది. రవితేజ కెరీర్ లో ఇదే అత్యదిక వసూళ్లను అందుకున్న సినిమా. ఇక మాస్ రాజా నెక్స్ట్ ఖిలాడి సినిమాతో హిట్టు కొట్టాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నాడు.