Kranti Day 5 Collections బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న దర్శన్.. నాలుగో రోజే లాభాల్లోకి.. కాంతారను మించి..!

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా, రచిత రామ్ హీరోయిన్‌గా వీ హరికృష్ణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, ఎమోషనల్ డ్రామా క్రాంతి. సీనియర్ నటులు రవిచంద్రన్, తరుణ్ అరోరా, రవిశంకర్, సంపత్ రాజ్, అచ్యుత్ రాజ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ హిట్ టాక్‌ను నమోదు చేసుకొంటున్నది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26వ తేదీన రిలీజైన ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో ఏం రేంజ్ కలెక్షన్లు సాధించింది? ఐదో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

30 కోట్ల బడ్జెట్‌తో

30 కోట్ల బడ్జెట్‌తో

హీరో దర్శన్ విభిన్నమైన పాత్రలో నటించిన క్రాంతి కన్నడ చిత్రం సుమారు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. రిలీజ్‌కు ముందు థియేట్రికల్ బిజినెస్ సుమారు 20 కోట్ల రూపాయలుగా నమోదైంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను 21 కోట్లుగా నిర్ణయించారు. ఇలాంటి టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టిన క్రాంతి చిత్రం భారీ వసూళ్లును సాధిస్తున్నది.

4 రోజుల కలెక్షన్లు

4 రోజుల కలెక్షన్లు


క్రాంతి చిత్రం గత నాలుగు రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి. తొలి రోజు 10 కోట్లు, రెండో రోజు 4 కోట్లకుపైగా, మూడు రోజు 4.25 కోట్లు, నాలుగో రోజు 4.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లో సుమారు 24 కోట్ల వసూళ్లు సాధించింది. తొలి వారాంతంలో కాంతార మూవీని మించిన వసూళ్లు సాధించింది.

కన్నడ వెర్షన్‌తోనే రిలీజ్

కన్నడ వెర్షన్‌తోనే రిలీజ్


ఇక క్రాంతి మూవీ రిలీజ్ విషయానికి వస్తే.. కేవలం కన్నడ భాషలోనే రిలీజైంది. కన్నడ వెర్షన్‌ను ఇండియాలోని ప్రధాన నగరాల్లోనే ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైలోని అతికొద్ది స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

5వ రోజు ఆక్యుపెన్సీ

5వ రోజు ఆక్యుపెన్సీ

కన్నడ రాష్ట్రంలో క్రాంతి ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో 44 శాతం, హుబ్లీలో 22 శాతం, గుల్బార్గాలో 50 శాతం, మైసూరులో 40 శాతం, శివమొగ 34 శాతం, మణిపాల్‌లో 10 శాతం, రాయ్‌చూరులో 47 శాతం, హైదరాబాద్‌లో 77 శాతం, చెన్నైలో 26 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

5వ రోజు కలెక్షన్ల అంచనా

5వ రోజు కలెక్షన్ల అంచనా


క్రాంతి చిత్రం హాలీడేస్‌లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. తాజా ఆక్యుపెన్సీని చూస్తే.. ఈ చిత్రం ఐదు రోజుల్లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 5 రోజుల్లో 25.5 కోట్ల షేర్, 35 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది

క్రాంతి మూవీకి లాభాలు ఎంతంటే?

క్రాంతి మూవీకి లాభాలు ఎంతంటే?

ఇక క్రాంతి చిత్రం దర్శన్ కెరీర్‌లో ఉత్తమ వసూళ్లను నమోదు చేస్తున్నది. 21 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం 5 రోజుల్లో లాభాల్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం 4 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X