Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
కన్నడ సూపర్ స్టార్ దర్శన్ నటించిన క్రాంతి బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. కన్నడ వెర్షన్లో మాత్రమే రిలీజైన ఈ చిత్రం దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తుండగా మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. రచితా రామ్, రవిచంద్రన్, వీరస్వామి, సంపత్ రాజ్ నటించిన ఈ చిత్రం తొలివారాంతం భారీ ఒపెన్సింగ్స్ సాధించింది. గత 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
విద్యా రంగంలో అక్రమాలపై ఎన్నారై పోరాటం
ఎడ్యుకేషన్ మాఫియాపై ఓ ఎన్నారై యువకుడు చేసిన పోరాటం బ్యాక్ డ్రాప్‌గా క్రాంతి సినిమాను తెరకెక్కించారు. తన స్కూల్ 100వ వార్షికోత్సవం కోసం ఇండియాకు వచ్చిన ఎన్నారై బిజినెస్ మ్యాగ్నెట్.. విద్యాశాఖ మంత్రి అవినీతిపై ఉద్యమం చేపడుతాడు. ఈ చిత్రాన్ని సుమారు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. వీ హరికృష్ణ దర్శకత్వం వహించిన క్రాంతి చిత్రాన్ని దేశవ్యాప్తంగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
గత 5 రోజుల్లో క్రాంతి కలెక్షన్లు
రిపబ్లిక్ డే కానుకగా రిలీజైన క్రాంతి చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను సాధించింది. తొలి రోజున ఈ చిత్రం 12.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే అదే ఊపును రెండో రోజు కొనసాగించలేకపోయింది. రెండో రోజున 4.8 కోట్లు, మూడో రోజున 5.4 కోట్లు, నాలుగో రోజున 6 కోట్ల గ్రాస్, ఐదో రోజున 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 29 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
క్రాంతి 6వ రోజు ఆక్యుపెన్సీ
క్రాంతి సినిమా 6వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. బెంగళూరులో 37 శాతం, మైసూరులో 34 శాతం, శివమొగలో 31శాతం, హైదరాబాద్‌లో 30 శాతం, చెన్నైలో 22 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. వర్కింగ్ డే రోజను కూడా నిలకడగా ఫెర్ఫార్మ్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
6 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
క్రాంతి చిత్రం గత ఐదు రోజుల్లో 29 కోట్ల గ్రాస్‌తో భారీ వసూళ్లను నమోదు చేసింది. కన్నడ వ్యాప్తంగా ఈ చిత్రం 6వ రోజున మరో 3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం ఆరు రోజుల్లో 32 కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దర్శన్ కెరీర్లో తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఘనతను సాధించే అవకాశం ఉంది.
క్రాంతి లాభాల్లోకి రావాలంటే?
హీరో దర్శన్ విభిన్నమైన పాత్రలో నటించిన క్రాంతి కన్నడ చిత్రం సుమారు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. రిలీజ్‌కు ముందు థియేట్రికల్ బిజినెస్ రూపంలో సుమారు 20 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను 21 కోట్లుగా నిర్ణయించారు. ఇలాంటి టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టిన క్రాంతి చిత్రం భారీ వసూళ్లును సాధిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి