Krishna Vrinda Vihari Day 4 Collections హిట్టా? ఫట్టా? 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఎక్కువవ బడ్జెట్ కావడంతో ఈ సినిమా ఖర్చుకు మంచి అయింది. ఇక నాగశౌర్యకు ఈ సినిమా కంపల్సరీ హిట్ గా కావాల్సిన పరిస్థితి ఉండటంతో ట్రేడ్ వర్గాల్లొ ఆసక్తిని రేపింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా 4 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

టోటల్ బడ్జెట్ ఎంతంటే?
కృష్ణ వ్రింద విహారి సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు 10 కోట్ల మేర అయిందనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. వాస్తవానికి ఈ సినిమా కోసం వేసుకొన్న బడ్జెట్ తక్కువే. నాగశౌర్య మార్కెట్‌కు తగినట్టుగానే మూవీని పట్టాలెక్కించారు. ఇక కోవిడ్ సమయంలో సినిమా షూట్ వాయిదాపడటంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని స్వయంగా నిర్మాతలు వెల్లడించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఇక కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే... ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థ్రియేట్రికల్ బిజినెస్‌ను 5.88 కోట్లుగా అంచనా కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం ఈ 6 కోట్ల సంపాదించాల్సి ఉందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తారు వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

గత 3 రోజుల కలెక్షన్లు
కృష్ణ వ్రింద విహారి మూవీ నాగశౌర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ రిపోర్టు. తొలి రోజున ఈ చిత్రం 1.1 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజున ఈ చిత్రం 1.45 కోట్లు సాధించింది. అలాగే మూడొ రోజున ఈ చిత్రం అంటే ఆదివారం భారీ వసూళ్లను సాధించింది. గత రెండోరోజుల్లో సాధించిన దాని కంటే భారీగా రాబట్టింది. మూడో రోజున ఈ చిత్రం 1.75 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 4.3 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

4వ రోజు కలెక్షన్లు
ఇక అన్ని సినిమాలకు అగ్ని పరీక్షగా మారే సోమవారం రోజున కూడా కృష్ణ వ్రింద విహారి చిత్రం మెరుగైన వసూళ్లను రాబట్టడం ట్రేడ్ సర్కిళ్లలో జోష్ కనిపించింది. ఈ చిత్రం నాలుగో రోజున ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం గత 4 రోజుల్లో 5.20 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది.

లాభాల్లోకి రావాలంటే?
కృష్ణ వ్రింద విహారి చిత్రం బాక్సాఫీస్ జర్నీ అంచనాలకు తగినట్టుగానే వెళ్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 5.2 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇంకా 80 లక్షల షేర్ సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ వారాంతంలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











