Krishna Vrinda Vihari Collections: 5.60 కోట్ల టార్గెట్.. వారంలో ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి చిత్రంతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుని.. అందరి దృష్టినీ ఆకర్షించాడు హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించి విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో పంథాను మార్చుకుని విభిన్నమైన సినిమాలతో వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాగశౌర్య 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచానలతో విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

‘కృష్ణ వ్రిందా విహారి’ వచ్చిందిలా
నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ రూపొందించిన సినిమానే 'కృష్ణ వ్రిందా విహారి'. ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో నటించారు.

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్
ఆంధ్రా, తెలంగాణలో యంగ్ హీరో నాగశౌర్యకు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో 'కృష్ణ వ్రిందా విహారి' మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్ల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

ఏడో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'కృష్ణ వ్రిందా విహారి' 7వ రోజు వసూళ్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 50 వేలు, గుంటూరులో రూ. 50 వేలు, కృష్ణాలో రూ. 80 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో.. రూ. 8 లక్షలు షేర్, రూ. 15 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

వారానికి కలిపి ఎంత వసూలైంది?
వారం రోజుల్లో 'కృష్ణ వ్రిందా విహారి' ఏపీ, టీఎస్‌లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 38 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి రూ. 3.50 కోట్లు షేర్, రూ. 6.02 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?
వారం రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 3.48 కోట్లు వసూలు చేసిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 66 లక్షలు వసూలు చేసింది. దీంతో 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.34 కోట్లు షేర్, రూ. 8.00 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?
నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.34 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.26 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.


Click it and Unblock the Notifications











