For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishna Vrinda Vihari Collections: 2వ రోజు భారీ వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

    |

    టాలీవుడ్‌లో స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి తనదైన చిత్రాలతో అలరిస్తోన్న ఈ కుర్ర హీరో.. సరైన హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచానలతో వచ్చిన ఈ సినిమా 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

     కృష్ణ వ్రిందా విహారి అంటూ వచ్చాడు

    కృష్ణ వ్రిందా విహారి అంటూ వచ్చాడు

    హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రమే 'కృష్ణ వ్రిందా విహారి'. అనీష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలకమైన పాత్రలను పోషించారు.

    ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

    కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

    కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

    నాగశౌర్యకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో 'కృష్ణ వ్రిందా విహారి' మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

    రెండో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    రెండో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి రెండో రోజు వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 92 లక్షలు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

    2 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

    2 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

    నాగశౌర్య 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి 2 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి రూ. 1.62 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 1.62 కోట్లు వసూలు చేసిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 42 లక్షలు వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.14 కోట్లు షేర్‌, రూ. 3.80 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

    యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

    నాగశౌర్య హీరోగా రూపొందిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.14 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.46 కోట్లు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

    రెండు రోజుల్లోనే అన్ని కోట్లతో రచ్చ

    రెండు రోజుల్లోనే అన్ని కోట్లతో రచ్చ

    రొమాంటిక్ లవ్ స్టోరీతో రూపొందిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి మొదటి రోజు టికెట్ రేట్ల తగ్గింపు వల్ల అనుకున్న కలెక్షన్లు రాలేదు. కానీ, రెండో రోజు మాత్రం రూ. కోటి పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇలా రెండు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు సగం కలెక్షన్లను రాబట్టింది. ఈ ఊపు చూస్తుంటే మరో మూడు, నాలుగు రోజుల్లో ఇది హిట్ స్టేటస్‌ను అందుకునే అవకాశం ఉంది.

    English summary
    Young actor Naga Shaurya Did Krishna Vrinda Vihari Movie Under Annish Krishna Direction. This Movie Collects Rs 2.14 Cr in 2 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X