Krishna Vrinda Vihari Collections: సండే ఫుల్ కలెక్షన్స్.. 3 రోజుల్లో అన్ని కోట్లు.. హిట్ అవ్వాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే హ్యాండ్సమ్‌ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో యంగ్ హీరో నాగశౌర్య ఒకడు. సాదాసీదా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరును, విజయాలను సొంతం చేసుకున్నాడు. మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్‌ను తెచ్చుకున్న శౌర్య.. క్రమంగా పంథాను మార్చుకుని విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నాగశౌర్య 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో వచ్చాడు. ఎన్నో అంచానలతో వచ్చిన ఈ మూవీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

కృష్ణ వ్రిందా విహారి మూవీ వివరాలు

కృష్ణ వ్రిందా విహారి మూవీ వివరాలు

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో అనీష్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ మూవీనే 'కృష్ణ వ్రిందా విహారి'. ఈ చిత్రంలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలకమైన పాత్రలు చేశారు.

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాగశౌర్యకు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో 'కృష్ణ వ్రిందా విహారి' మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ అయింది.

మూడో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

మూడో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

'కృష్ణ వ్రిందా విహారి' ఏపీ, తెలంగాణలో 3వ రోజు వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 55 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.13 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

3 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

3 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి 3 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి రూ. 2.75 కోట్లు షేర్, రూ. 4.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 2.75 కోట్లు వసూలు చేసిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 13 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 52 లక్షలు వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.40 కోట్లు షేర్‌, రూ. 6.20 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.40 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.20 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

నాగశౌర్యకు కలిసొచ్చిన వీకెండ్

నాగశౌర్యకు కలిసొచ్చిన వీకెండ్

నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి మొదటి రోజు టికెట్ రేట్ల తగ్గింపు వల్ల అనుకున్న కలెక్షన్లు రాలేదు. కానీ, రెండో రోజు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. కోటి పైగా కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు వసూళ్లు మరింతగా పెరిగాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ అంచనాలను అందుకున్నట్లే అని చెప్పొచ్చు. వీక్ డేస్‌లో ప్రదర్శనపై ఈ మూవీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X