Krishna Vrinda Vihari Collections: నాగశౌర్యకు బిగ్ షాక్.. 5వ రోజు ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

హీరోగా పరిచయమైన కొత్తలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలు టాలీవుడ్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య ఒకడు. లవర్ బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. ఫలితంగా విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాగశౌర్య 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచానలతో విడుదలైన ఈ మూవీ 5 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

రొమాంటిక్‌ లవ్‌తో కృష్ణ వ్రిందా విహారి

రొమాంటిక్‌ లవ్‌తో కృష్ణ వ్రిందా విహారి

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రమే 'కృష్ణ వ్రిందా విహారి'. అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ మూవీలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలకమైన పాత్రలను పోషించారు.

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

యంగ్ హీరో నాగశౌర్యకు ఆంధ్రా, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో 'కృష్ణ వ్రిందా విహారి' మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

ఐదో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

ఐదో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

'కృష్ణ వ్రిందా విహారి' ఏపీ, తెలంగాణలో 5వ రోజు వసూళ్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

5 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

5 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి 5 రోజుల్లో వసూళ్లు సోసోగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 35 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి రూ. 3.28 కోట్లు షేర్, రూ. 5.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

5 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 3.28 కోట్లు వసూలు చేసిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు వసూలు చేసింది. దీంతో ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.07 కోట్లు షేర్‌, రూ. 7.45 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

రొమాంటిక్ లవ్ స్టోరీతో వచ్చిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.07 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.53 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

నాగశౌర్యకు వీక్ డేస్‌లో బిగ్ షాక్

నాగశౌర్యకు వీక్ డేస్‌లో బిగ్ షాక్

యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి మొదటి రోజు టికెట్ రేట్ల తగ్గింపు వల్ల అనుకున్న కలెక్షన్లు రాలేదు. కానీ, రెండో రోజు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. కోటి పైగా కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు వసూళ్లు మరింతగా పెరిగాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ అంచనాలను అందుకున్నట్లే అని చెప్పొచ్చు. కానీ, వీక్ డేస్‌లో మాత్రం వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X