Krishna Vrinda Vihari Collections: నాగశౌర్యకు మరో దెబ్బ.. 6 రోజుల్లో ఇంతే.. అన్ని కోట్లు వస్తేనే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. విభిన్నమైన ప్రయోగాలతో వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాగశౌర్య 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచానలతో విడుదలైన ఈ సినిమా 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరు కూడా చూసేయండి!

ఫన్ మూవీగా ‘కృష్ణ వ్రిందా విహారి'

ఫన్ మూవీగా ‘కృష్ణ వ్రిందా విహారి'

నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమానే 'కృష్ణ వ్రిందా విహారి'. ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలకమైన పాత్రలు చేశారు.

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్యకు ఆంధ్రా, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో 'కృష్ణ వ్రిందా విహారి' మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్ల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ అయింది.

ఆరో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

ఆరో రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

ఏపీ, తెలంగాణలో 'కృష్ణ వ్రిందా విహారి' 6వ రోజు వసూళ్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 80 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో.. రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

6 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

6 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

'కృష్ణ వ్రిందా విహారి' తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 32 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి రూ. 3.42 కోట్లు షేర్, రూ. 5.90 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

6 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 3.42 కోట్లు వసూలు చేసిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 64 లక్షలు వసూలు చేసింది. దీంతో ఆరు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.24 కోట్లు షేర్‌, రూ. 7.80 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

నాగశౌర్య హీరోగా నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.24 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.36 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

నాగశౌర్యకు దెబ్బ మీద దెబ్బలు

నాగశౌర్యకు దెబ్బ మీద దెబ్బలు

నాగశౌర్య - షెర్లీ సేతియా జంటగా నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి మొదటి రోజు టికెట్ రేట్ల తగ్గింపు వల్ల అనుకున్న కలెక్షన్లు రాలేదు. కానీ, రెండు, మూడో రోజు వసూళ్లు మరింతగా పెరిగాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ అంచనాలను అందుకున్నట్లే అని చెప్పొచ్చు. కానీ, వీక్ డేస్‌లో మాత్రం వరుస దెబ్బలు తగులుతున్నాయి. దీంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X