Krishna Vrinda Vihari Collections: నాగశౌర్యకు కోలుకోలేని షాక్.. హిట్ టాక్ ఉన్నా ఊహించని విధంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. తద్వారా తమ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఒకడు. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. కెరీర్‌ను బ్యాలెన్స్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడీ యంగ్ హీరో 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచానలతో విడుదలైన ఈ సినిమాకు టాక్‌కు అనుగుణంగా మంచి కలెక్షన్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో 8 రోజుల్లో ఈ చిత్రం ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

‘కృష్ణ వ్రిందా విహారి'లో వాళ్లంతా

‘కృష్ణ వ్రిందా విహారి'లో వాళ్లంతా

నాగశౌర్య -అనీష్ కృష్ణ కాంబోలో రూపొందిన చిత్రమే 'కృష్ణ వ్రిందా విహారి'. ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు.

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్


యంగ్ హీరో నాగశౌర్యకు ఏపీ, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో 'కృష్ణ వ్రిందా విహారి' మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్ల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ అయింది.

8వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

8వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?


హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ, క్రమంగా ఈ చిత్రం ప్రభావాన్ని కోల్పోతుంది. దీంతో వసూళ్లు రోజురోజుకూ డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 8వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి దీనికి రూ. 6 లక్షలు షేర్, రూ. 13 లక్షలు గ్రాస్ వచ్చింది.

 8 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

8 రోజులకు కలిపి ఎంత వసూలైంది?


8 రోజుల్లో 'కృష్ణ వ్రిందా విహారి' ఏపీ, తెలంగాణలో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 39 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి రూ. 3.53 కోట్లు షేర్, రూ. 6.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?


ఆంధ్రా, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 3.53 కోట్లు వసూలు చేసిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపడం లేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 67 లక్షలు వసూలు చేసింది. దీంతో 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.38 కోట్లు షేర్‌, రూ. 8.15 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

 టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?


రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.38 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.22 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X