twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishna Vrinda Vihari Collections: శనివారం షాకింగ్ వసూళ్లు.. 9 రోజుల్లో ఇంతే.. ఎంత వస్తే హిట్ అంటే!

    |

    ఏమాత్రం సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య. అలాగే, ఆరంభంలోనే పలు విజయాలను కూడా ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

    ఈ క్రమంలోనే నాగశౌర్య ఇటీవలే 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా అంచానలతో విడుదలైన ఈ సినిమాకు టాక్‌కు మంచిగానే వచ్చినా.. కలెక్షన్లు ఆశించిన రీతిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో 9 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    ‘కృష్ణ వ్రిందా విహారి' వచ్చేశాడుగా

    ‘కృష్ణ వ్రిందా విహారి' వచ్చేశాడుగా

    నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ తీసిన రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీనే 'కృష్ణ వ్రిందా విహారి'. ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్యలు నటించారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

    బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

    కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

    కృష్ణ వ్రిందా విహారి బిజినెస్ డీటేల్స్

    హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్యకు ఏపీ, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో 'కృష్ణ వ్రిందా విహారి' మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్ల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

    9వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    9వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య - షెర్లీ సేతియా జంటగా నటించిన చిత్రమే 'కృష్ణ వ్రిందా విహారి'. ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ, క్రమంగా ఈ చిత్రం ప్రభావాన్ని కోల్పోవడంతో వసూళ్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 9వ రోజు దీనికి రూ. 8 లక్షలు షేర్, రూ. 15 లక్షలు గ్రాస్ వచ్చింది.

    యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శనయాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

    9 రోజులకు కలిపి ఎంత వసూలైంది?

    9 రోజులకు కలిపి ఎంత వసూలైంది?


    'కృష్ణ వ్రిందా విహారి' 9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి రూ. 3.61 కోట్లు షేర్, రూ. 6.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 3.61 కోట్లు వసూలు చేసిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపడం లేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 19 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 68 లక్షలు వసూలు చేసింది. దీంతో 9 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.48 కోట్లు షేర్‌, రూ. 8.30 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

    <strong>దీపిక - రణ్‌వీర్ విడాకులు: నగ్నంగా చేసిన పని వల్లే.. హీరోనే స్వయంగా చెప్పడంతో!</strong><br />దీపిక - రణ్‌వీర్ విడాకులు: నగ్నంగా చేసిన పని వల్లే.. హీరోనే స్వయంగా చెప్పడంతో!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రాబట్టాలి?


    క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.48 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.12 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

    English summary
    Young actor Naga Shaurya Did Krishna Vrinda Vihari Movie Under Annish Krishna Direction. This Movie Collects Rs 4.48 Cr in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X