twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని ‘కృష్ణార్జున యుద్ధం’ కలెక్షన్స్ పరిస్థితి ఇది... లాభాల్లోకి రావాలంటే ఇంకా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Krishnarjuna Yuddham Collections Finding a Bit Tough

    నేచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణార్జున యుద్ధం' బాక్సాఫీసు వద్ద ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయి లేవు. మధ్య కాలంలో నాని వరుస హిట్లతో హాట్రిక్స్ కొట్టడం, సక్సెస్ గ్రాఫ్ హైలో ఉండటంతో 'కృష్ణార్జున యుద్ధం' థియేట్రికల్ రైట్స్ గత చిత్రాలకంటే ఎక్కువ రేటుకే అమ్ముడయ్యాయి. మార్కెట్లో నానికి ఉన్న క్రేజ్, మేనియాను క్యాష్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆయా ఏరియాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు. అయినప్పటికీ నాని గత చిత్రాల రికార్డులను కూడా అందుకోలేక పోయింది.

     తొలి రోజు నుండే...

    తొలి రోజు నుండే...

    తొలి రోజు కృష్ణార్జున యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ. 9.70 కోట్ల గ్రాస్ వసూలైంది. నాని నటించిన గత చిత్రం ‘ఎంసీఏ' తొలి రోజు రూ. 15.50 కోట్లు రాబట్టింది. ఈ రికార్డును బ్రేక్ చేయడంలో ‘కృష్ణార్జున యుద్ధం' విఫలమైంది.

     యావరేజ్ రెస్పాన్స్

    యావరేజ్ రెస్పాన్స్

    అటు ఫిల్మ్ క్రిటిక్స్ నుండి ఇటు ఆడియన్స్ నుండి సినిమాకు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా మంది రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రంగస్థలం'చిత్రాన్ని ఫస్ట్ చాయిస్ గా ఎంచుకున్నారు. టికెట్ కౌంటర్స్ వద్ద శని, ఆదివారాల్లో కూడా యావరేజ్ రెస్పాన్స్ రావడమే ఇందుకు నిదర్శనం.

    ఆ రెండు చిత్రాల కంటే వెనకే...

    ఆ రెండు చిత్రాల కంటే వెనకే...

    ఫస్ట్ వీకెండ్ ‘కృష్ణార్జున యుద్ధం' ప్రపంచ వ్యాప్తంగా రూ. 25 కోట్లు గ్రాస్(13 కోట్ల షేర్) వసూలు చేసింది. నాని గత చిత్రాలు ఎంసీఏ ఫస్ట్ వీకెండ్ రూ. 37.40 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, నిన్ను కోరి రూ. 27.50 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రెండు చిత్రాలను బీట్ చేయడంలో ‘కృష్ణార్జున యుద్ధం' విఫలమైంది.

     లాభాల్లోకి రావాలంటే ఇంకా ఇంత రావాలి

    లాభాల్లోకి రావాలంటే ఇంకా ఇంత రావాలి

    కృష్ణార్జున యుద్ధం దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 26 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 13 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది. మరో 13 కోట్లకు పైగా షేర్ వసూలైతే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింటును చేరుకుంటుంది.

    English summary
    Krishnarjuna Yuddham minted Rs 25 crore gross in first weekend. As per early estimates, the movie has earned over Rs 13 crore share. Made on budget of over Rs 20 crore, Krishnarjuna Yuddham fetched Rs 26 crore for its producers from the sale of its theatrical rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X