Teri Baaton Mein Aisa Uljha Jiya Collections కృతిసనన్ మూవీకి భారీ టార్గెట్.. షాహిద్ బాక్సాఫీస్ కొల్లగొట్టేనా?
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతిసనన్ జంటగా నటించిన తేరి బాతో మే ఐసా ఉల్జా జియా సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ జోషి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే, లక్ష్మణ్ ఉటేకర్ నిర్మించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
తేరి బాతో మే ఐసా ఉల్లా జియా (Teri Baaton Mein Aisa Uljha Jiya) చిత్రంలో షాహిద్, కృతిసనన్‌తోపాటు ధర్మేంద్ర, డింపుల్ కాపాడియా లాంటి సీనియర్ హీరో, హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక నటీనటులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు.

తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ యువతీ, యువకుల్లో అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా యూత్‌ను మాత్రమే టార్గెట్ చేయకుండా.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆకట్టుకొనే విధంగా రూపొందించారు. దాంతో ఈ సినిమాను ఇండియాలో 2000 స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
ముంబై, ఢిల్లీ, దుబాయ్ నగరాల్లో భారీ ప్రమోషన్స్ నిర్వహించిన తర్వాత Teri Baaton Mein Aisa Uljha Jiya మూవీ అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించారు. అయితే గతంలో వచ్చిన షాహిద్ కపూర్ సినిమాలతో పోల్చుకొంటే.. ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. అయితే మూవీకి రిలీజ్ డేట్ వరకు అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా అడ్వాన్స్ బుకింగ్ నత్తనడకన సాగుతున్నది. ఇప్పటి వరకు నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లలో సుమారుగా 8000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ మూవీ ఇప్పటి వరకు 70 లక్షలు నికరంగా 80 లక్షలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ రేంజ్ కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందనే విషయంపై ఆసక్తిగా ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగానే ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 80 కోట్ల షేర్ 160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ రేంజ్ వసూళ్లు రాబడితే గానీ.. ఈ సినిమా హిట్ గానీ.. సూపర్ హిట్ స్టాటస్‌ను అందుకోలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











