Kuberaa Day 2 Box Office: కుబేరా 2వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు.. ఓవర్సీస్ లో ధనుష్ దూకుడు.. ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రేక్షకుల అభిరులకు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని కుబేరా చిత్రంలో నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం జూన్ 20న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీలో విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రానికి సంయుక్తంగా నిర్మించాయి. సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరించారు. ఓపెనింగ్ డే ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో కుబేరా బాక్సాఫీస్ వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ కలెక్షన్స్, ఓపెనింగ్ డే బాక్సాఫీస్ వసూళ్లు, 2వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

కుబేరా బడ్జెట్ ఎన్ని కోట్లు?
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి బడ్జెట్ సరిగ్గా వినియోగించారు. స్టార్ కాస్ట్ అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ జిమ్ సర్బ్ లు ఈ చిత్రంలో నటించడం, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, ప్రముఖ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ కలుపుకొని రూ.120 కోట్ల వరకు బడ్జెట్ ను వెచ్చించారని ట్రేడ్ నిపుణులు తెలిపారు.

Kubera Day 2 Box Office Collection Worldwide

కుబేరా బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఈ చిత్రానికి ప్రధానంగా శేఖర్ కమ్ముల కంటెంట్, ధనుష్ కు ఉన్న మార్కెట్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ మాదిరిగానే జరిగింది. నాన్ థియేట్రికల్ ద్వారా రూ.65 కోట్లు వ్యాపారం జరిగింది. ఇందులో తెలుగు నుంచి రూ.40 కోట్లు, తమిళం నుంచి రూ.20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక మిగితా స్టేట్స్, ఓవర్సీస్ కలిపి రూ.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.60 కోట్ల వరకు ఇండియా షేర్, రూ.120 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ పండింతులు విలువ కట్టారు.

కుబేరా అడ్వాన్స్ సేల్స్..
ధనుష్ హీరో కావడం, శేఖర్ కమ్ముల డైరెక్షన్ కారణంగా కుబేరా చిత్రంపై రిలీజ్ కు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానితోడు మేకర్స్ గట్టిగా ప్రమోట్ చేయడంతో ఆడియెన్స్ అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బుకింగ్స్ ఓపెనింగ్ అయిన రోజు నుంచి రిలీజ్ డే వరకు బుక్ మై షో ద్వారా 3 లక్షల 28 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దీంతో కుబేరా చిత్రానికి ప్రీ సేల్ ద్వారా రూ.4 కోట్ల కలెక్ట్ అయ్యింది. మరోవైపు కేవలం ఓవర్సీస్ లోనే ఓపెనింగ్ డే 100కే డాలర్లు వసూల్ చేయడం విశేషం.

కుబేరా వరల్డ్ వైడ్ 2రోజుల వసూళ్లు..
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కుబేరా చిత్రం మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది. ఇండియా నెట్ రూ.14.75 కోట్లుగా.. ఇందులో తెలుగులోనే రూ.10 కోట్లు, తమిళంలో రూ.4.5 కోట్లు, హిందీలో రూ.23 లక్షలు, కన్నడలో రూ.2 లక్షలు వసూల్ చేసింది. ఇండియా గ్రాస్ రూ.17.35 కోట్లు, ఓవర్సీస్ లో రూ.10.15, ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.27.50 కోట్లు తొలిరోజు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. కాగా తొలిరోజు ఇండియాకు ధీటుగా ఓవర్సీస్ వసూళ్లు రావడం విశేషం. ఇక 2వ రోజు ఈ చిత్రం రూ.16 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 2వ రోజు వరకు ఈ చిత్రం ఇండియా నెట్ రూ.30.75 కోట్లకు చేరుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా డే2 కుబేరా చిత్రం రూ.55 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Read more about: Kuberaa dhanush box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X