Kuberaa Advance Collections: కుబేరాకు షాకింగ్ ఓపెనింగ్స్.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కుబేరా ట్రైలర్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై మరింత పాజిటివిటీ పెరిగింది. ఈ క్రమంలో రిలీజ్‌కు కావాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొంటున్నది. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కుబేరా సినిమాకు కథ డిమాండ్ చేయడంతో స్టార్ హీరో, హీరోయిన్లే కాకుండా బాలీవుడ్ నుంచి పలువురు యాక్టర్లను నటింపజేశారు. అలాగే తెలుగులో పాపులర్ యాక్టర్లు ఇందులో భాగమయ్యారు. అంతేకాకుండా టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. దాంతో ఈ సినిమాకు భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా క్వాలిటీ కూడా రిచ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను మొత్తంగా 120 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కుబేరా సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకసారి ట్రైలర్ విడుదల చేసిన తర్వాత మంచి బజ్ క్రియేట్ అయింది. కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాగా ఓ మార్క్ క్రియేట్ అయింది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళంలో కలిపి 60 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళంలో 20 కోట్లు మేర బిజినెస్ జరిగింది. తెలుగులో 40 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ కట్టారు. మిగితా రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ధనుష్ హీరో కావడంతో తమిళంలో కుబేరాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే ట్రేడ్ వర్గాలు అంచనాలకు భిన్నంగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. అయితే ధనుష్ క్రేజ్, ఇమేజ్‌కు తగినట్టుగా ఓపెనింగ్స్ లేకపోవడం బిజినెస్ వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది. రిలీజ్‌కు ఎక్కువ సమయం లేకపోవడం వల్ల కలెక్షన్లు పుంజుకొంటాయా? అని ఎదురు చూస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఫర్వాలేదనే విధంగా సాగుతున్నద. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. యూఎస్‌లో ఇప్పటికే ఈ సినిమా 100K డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 1 కోటి రూపాయల అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇండియాలో 60 కోట్ల షేర్.. 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











