Kuberaa Day 1 Box Office: ధనుష్ కుబేరా సంచలనం.. డే1 ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ 'కుబేరా'. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ను టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల నిర్మించారు. ఇక జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి కాస్తా పాజిటివ్ దక్కుతోంది. ఇక ఈ మూవీకి ప్రధానంగా తెలుగు స్టేట్స్ నుంచే బాక్సాఫీస్ నంబర్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. కాగా కుబేరా చిత్రం డే1 బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ కలెక్షన్స్, ఓపెనింగ్ డే బాక్సాఫీస్ వివరాల్లోకి వెళితే..
కుబేరా బడ్జెట్ ఎన్ని కోట్లు?
కోలీవుడ్ స్టార్, టాలీవుడ్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈచిత్రం భారీ బడ్జెట్ తోనే రూపుదిద్దుకుంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. అలాగే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే టాప్ టెక్నీషియన్లు వర్క్ చేయడం, రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్లు కలుపుకొని రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కుబేరా బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఈ మూవీ ప్రమోషనల్ మెటీరియల్, శేఖర్ కమ్ముల కంటెంట్ పై క్రియేట్ అయిన బజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. నాన్ థియేట్రికల్ ద్వారా రూ.65 కోట్ల బిజినెస్ జరిగిందని, ఇందులో తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మిగితా స్టేట్స్, ఓవర్సీస్ కలిపి రూ.5 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం రూ.60 కోట్ల వరకు ఇండియా షేర్, రూ.120 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ ను ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి.
కుబేరా అడ్వాన్స్ సేల్స్..
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి రిలీజ్ కు ముందే మంచి రెస్పాన్స్ దక్కింది. మేకర్స్ గట్టిగానే ప్రమోట్ చేయడంతో ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. డే1 ఒక్కరోజే బుక్ మై షో ద్వారా 3 లక్షల 28 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక ప్రీ సేల్స్ ద్వారా రూ.1కోటీ వరకు వసూలైంది. ఓవర్సీస్ లో ఓపెనింగ్ డే 100కే డాలర్లు వసూల్ చేయడం విశేషం.
కుబేరా వరల్డ్ వైడ్ 1వ రోజు వసూళ్లు..
తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కుబేరా చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్లు దక్కుతున్నాయి. 1వ రోజు ఇండియా నెట్ రూ.13 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఇందులో తెలుగు స్టేట్స్ లోనే 8 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిందని తెలుస్తోంది. మరోవైపు తమిళం, ఇతర భాషల్లో కలిపి రూ.5 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం తొలి రోజు రూ.26 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక తొలిరోజు యావరేజ్ గా 57 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.


Click it and Unblock the Notifications











