Kuberaa Day 1 Box Office: ధనుష్ కుబేరా ఓపెనింగ్ డే అదుర్స్.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కుబేరా'. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్టర్ చేశారు. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. తొలిరోజు చిత్రానికి కాస్తా పాజిటివ్ టాక్ దక్కడం విశేషం. దీంతో ఈ చిత్రం ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ కలెక్షన్స్, ఓపెనింగ్ డే బాక్సాఫీస్ వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..
కుబేరా మూవీ బడ్జెట్ ఎంత?
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి స్టార్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి వర్క్ చేశారు. అలాగే వివిధ లోకేషన్లలో షూటింగ్ చేశారు. రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్లు కలుపుకొని రూ.120 కోట్ల మేర బడ్జెట్‌తో రూపొందించారు.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరించారు.

కుబేరా బ్రేక్ ఈవెన్ టార్గెట్?
కుబేరా చిత్రం ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. శేఖర్ కమ్ముల కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం విశేషం. ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ ద్వారా రూ.65 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో ఈ చిత్రానికి రూ.40 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక మిగితా స్టేట్స్, ఓవర్సీస్ లో కలిసి రూ.5 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.60 కోట్ల ఇండియా షేర్, రూ.120 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.
కుబేరా అడ్వాన్స్ సేల్స్..
ధనుష్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి రిలీజ్ కు కాస్తా ముందుగానే రెస్పాన్స్ వస్తుంటుంది. ధనుష్ ఎంచుకునే సినిమా కథలకు ఆడియెన్స్ ఫిదా అవుతూ ఉంటారు. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కుబేరా చిత్రానికి అడ్వాన్స్ బుక్కింగ్స్ ద్వారా రూ.1కోటీ వరకు వసూలైంది. ఇక ఓవర్సీస్ లో 100కే డాలర్లు వసూల్ చేయడం విశేషం.
కుబేరా వరల్డ్ వైడ్ డే1 కలెక్షన్లు..
తొలి రోజు శుక్రవారం కుబేరా చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఓపెనింగ్ డే ఈ చిత్రానికి సాయంత్రం వరకు రూ.9 కోట్ల ఇండియా నెట్ వసూల్ అయ్యిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో చేసిందని అంచనా వేసింది. ఇప్పటికే ధనుష్ రాయన్ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ లో 60 శాతం వసూళ్లు చేసింది. కుబేరా ఓపెనింగ్ డే రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ పండింతులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











