Kuberaa Day 10 Collections: వీకెండ్‌లో ధనుష్ వసూళ్ల జాతర .. కుబేరకు 10వ రోజు ఎన్ని కోట్లంటే?
ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన చిత్రం కుబేర. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ కుబేర చిత్రాన్ని నిర్మించారు. జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేశారు. శేఖర్ జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది.
కుబేర బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కుబేర సినిమాకు రూ.145 కోట్ల వ్యయం అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.33 కోట్లు, తమిళనాడులో రూ.18 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8.5 కోట్ల చొప్పున మొత్తంగా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కుబేర. ధనుష్ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.66 కోట్ల షేర్.. రూ.132 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

కుబేర 9 రోజుల వసూళ్లు
కుబేర చిత్రం 9 రోజుల వసూళ్లు పరిశీలిస్తే.. తెలుగులో రూ.54 కోట్లు, తమిళంలో రూ.19 కోట్లు, కన్నడంలో రూ.5 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, కేరళలో కోటి రూపాయలు రాబట్టింది. దీంతో 9 రోజుల్లో కుబేర చిత్రం ఇండియా వైడ్‌గా రూ.82 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన కుబేర బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. సెకండ్ వీక్ ముగిసేనాటికి తెలుగు రాష్ట్రాలలో కుబేర తన టార్గెట్ ఫినిష్ చేసే అవకాశం ఉంది.
కుబేర ఓవర్సీస్ కలెక్షన్స్
తొలి వారాంతం తర్వాత నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కుబేరా జోరు దగ్గింది. అయితే ఈ వీకెండ్‌లో ధనుష్ మూవీ గట్టిగానే సందడి చేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు కుబేర చిత్రం 28.15 కోట్ల రూపాయలు సాధించింది. నేడో రేపో ఈ ఏరియాలో 30 కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కుబేర 10వ రోజు కలెక్షన్స్
ఆదివారం కుబేర కుమ్మేసింది. తెలుగులో 45.94 శాతం, తమిళంలో 30.77 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. 10వ రోజు కుబేరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.93 కోట్లు, తమిళంలో రూ.62 లక్షలు, కన్నడంలో రూ.20 లక్షలు, హిందీలో రూ.30 లక్షల చొప్పున ఇండియా వైడ్ నికరంగా 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 10 రోజుల వరకు కుబేర చిత్రం ఇండియాలో రూ.88 కోట్ల నెట్, రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.28.15 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.123 కోట్ల రూపాయలు వసూలు చేసింది కుబేర.
టఫ్ ఫైట్‌లో కుబేర
ఓవరాల్ గ్రాస్ కలెక్షన్స్‌ను బట్టి చూస్తే కుబేర.. బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. అయితే తమిళ్ సహా చాలా ఏరియాలలో కుబేరకు అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే కుబేర థియేట్రికల్ రన్ కొద్దిరోజులు నడిచే అవకాశం ఉంది. కుబేర సినిమా ధనుష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో రెండవ స్థానంలో నిలిచింది. రాయన్ (155 కోట్లు) ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. మొదటి వారంలో ఎదురు లేకుండా సాగిన శేఖర్ కమ్ముల చిత్రం సెకండ్ వీక్‌కు వచ్చేసరికి తెలుగులో కన్నప్ప నుంచి.. దక్షిణాదిలో హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్ ప్రిట్ నటించి ఎఫ్1 నుంచి పోటీ ఎదుర్కొంటోంది. మరి ఈ టఫ్ ఫైట్‌లో కుబేర ఎంత మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











