Kuberaa Day 11 Collections: 150 కోట్లపై కన్నేసిన కుబేరా.. 11వ రోజు ధనుష్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు.
ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కుబేరా మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 145 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రొమోలు, ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కుబేరాలోని స్టార్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది అని ట్రేడ్ వర్గాలు తమ రిపోర్టులో వెల్లడించాయి.
ఆంధ్రా, నైజాంలో గత 10 రోజుల్లో కుబేరా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 16 కోట్ల రూపాయలు, సీడెడ్ 4.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 2.7 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.6 కోట్లు, గుంటూరులో 2.2 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.2 కోట్లు, నెల్లూరులో 2.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మూవీ ఏపీ, తెలంగాణలో 36 కోట్లకుపైగా నెట్, 60 కోట్ల గ్రాస్ వసూలు నమోదు చేసింది.
ఇక ఆంధ్రా, తెలంగాణేతర రాష్ట్రాల వసూళ్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 11 కోట్ల రూపాయల గ్రాస్, తమిళనాడులో 20 కోట్ల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో మొత్తంగా 95 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 124 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక 11వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో అంతంతా మాత్రంగానే కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ఇండియాలో 11వ రోజున 1.5 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల మేర వసూళ్లు సాధించే అవకాశం ఉందని సాక్ నిల్క్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2.5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ సినిమా ప్రస్తుతం 150 కోట్ల రూపాయల మైలురాయిని టార్గెట్ పెట్టింది. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా ఆ టార్గెట్‌ను రీచ్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











