Kuberaa Day 12 Collections: కుబేరా ఆ రెండు ప్రాంతాల్లో నష్టాలు.. ధనుష్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు.

కుబేరా సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

Kuberaa Day 12 Estimated Box Office

కుబేరా మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 145 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రొమోలు, ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కుబేరాలోని స్టార్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది అని ట్రేడ్ వర్గాలు తమ రిపోర్టులో వెల్లడించాయి. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కుబేరా సినిమా నైజాంలో 16 కోట్ల రూపాయలు షేర్ రాబట్టింది. ఆంధ్రాలో 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం 62 కోట్ల గ్రాస్ వసూళ్లు, 32 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. 12వ రోజు భారీగా వసూళ్లు రాబడితే ఈ రోజే లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక కర్ణాటకలో 11 కోట్ల రూపాయలు, కేరళలో 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2.7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక కుబేర సినిమాకు తమిళనాడులోనే భారీగా దెబ్బ పడింది. ఈ సినిమా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా కనీసం 6 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయలు గ్రాస్, 64 కోట్ల షేర్ వసూలు చేసింది. 12వ రోజు 1.5 నుంచి 2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సాక్ నిల్క్ వెల్లడించింది.

More from Filmibeat

Read more about: Kuberaa dhanush box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X